నెల్లూరు కోర్టు చోరీ కేసు - పత్రాల రికవరీ : రాజకీయ నేతల జోక్యం లేదు - ఎస్పీ..!!
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనానికి కారణమైన నెల్లూరు కోర్టలో చోరీ కేసు దర్యాప్తు ముమ్మరం అయింది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ విజయారావు వెల్లడించారు. నిందితుల నుంచి ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరా దృశ్యాలు సహా పూర్తి ఆధారాలతో కేసు ఛేదించినట్లు తెలిపారు. నిందితులు కేవలం సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు తీసుకుని మిగతా పేపర్లను పడేశారని చెప్పారు. నిందితులు సయ్యద్ హయత్, ఖాజా రసూల్‌లను ఆత్మకూరు బస్టాండ్ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులపై 14 పాత కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ట్యాబ్, ల్యాప్‌ట్యాప్, 4 సెల్‌ఫోన్లు, 7 సిమ్‌కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
నెల్లూరు కోర్టులో దొంగతనం జరిగిందని గుర్తించిన కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసారు. జిల్లాకు చెందిన ఒక ప్రముఖ నేతకు చెందిన కేసులో పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్క్ స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ కేసు విచారణ వివరాలను వెల్లడించిన పోలీసు అధికారులు... నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో 13వ తేదీ అర్ధరాత్రి కొందరు వ్యక్తులు చొరబడ్డారన్నారు. ఓ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకువెళ్లారని చెప్పారు.

14వ తేదీ (గురువారం) ఉదయం కోర్టుకొచ్చిన సిబ్బంది దొంగతనం జరిగినట్లు గుర్తించి.. పోలీసులకు సమాచారమిచ్చారని వివరించారు. దొంగతనానికి గురైన సంచిని కోర్టు బయట ఉన్న కాలువలో గుర్తించిన పోలీసులు దాన్ని పరిశీలించామని.. అందులో ఉండాల్సిన పలు దస్త్రాలు మాయమైనట్లు గుర్తించినట్లుగా తెలిపారు. కోర్టులో దొంగతనం జరిగిన మాట వాస్తవమని, దానిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
కోర్టులో చోరీకి గురైన అన్నింటినీ రికవరీ చేశామని పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే విచారణ అధికారికి ఇవ్వొచ్చన్నారు. ఈ కేసులో ఈ రాజకీయ నాయకుల ప్రమేయం లేదని నెల్లూరు ఎస్పీ విజయారావు తెలిపారు. ఇప్పటివరకు లభించిన ప్రాథమిక ఆధారాల ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. కోర్టుకు సమీపంలోని శ్రీ ఉమమహేశ్వర స్వామి ఆలయం వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
-
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్












Click it and Unblock the Notifications