కోటంరెడ్డికి టీడీపీ ఎంట్రీలో కొత్త ట్విస్ట్ - వాట్ నెక్స్ట్..!?

ఎమ్మెల్యే కోటంరెడ్డి రాజకీయ అడుగులు ఎటు. టీడీపీలోకి ఖాయమని చెబుతున్న వేళ కొత్త ట్విస్టు చోటు చేసుకుంది.

ఎమ్మెల్యే కోటంరెడ్డి రాజకీయ అడుగులు ఎటు. టీడీపీలోకి ఖాయమని చెబుతున్న వేళ కొత్త ట్విస్టులు తెర మీదకు వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి టీడీపీ నుంచే పోటీ చేస్తారని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశం తరువాతనే కోటంరెడ్డి సొంత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే వైసీపీ నుంచి నెల్లూరు రూరల్ అభ్యర్ధిగా ఎంపీ ఆదాల వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. కోటంరెడ్డి ఎంట్రీ పైన టీడీపీ నుంచి భిన్నవాదన వినిపిస్తోంది. మరి...కోటంరెడ్డి టీడీపీలోనే చేరుతారా..చంద్రబాబు సీటు ఇస్తారా..తాజాగా చోటు చేసుకున్న పరిణామాలతో అందుతున్న సంకేతాలేంటి..

టీడీపీ నుంచి పోటీ పై కోటంరెడ్డి అంచనాలు

టీడీపీ నుంచి పోటీ పై కోటంరెడ్డి అంచనాలు


వచ్చే ఎన్నికల్లో తాను టీడీపీ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్లు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి స్పష్టం చేసారు. చంద్రబాబు నిర్ణయం ఫైనల్ అని తేల్చి చెప్పారు. సొంత ప్రభుత్వం పైన ఆరోపణలు చేయటానికి ముందే చంద్రబాబు నుంచి సీటు పైన కోటంరెడ్డి హామీ పొందారని ప్రచారం సాగింది. దీంతో..వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆదాల.. టీడీపీ నుంచి కోటంరెడ్డి నెల్లూరు రూరల్ బరిలో ఉంటారని అందరూ భావిస్తున్నారు. ఇప్పటి వరకు టీడీపీ నేతలు మాత్రం ఎక్కడా కోటంరెడ్డి పార్టీలోకి రావటం పైన సానుకూలంగా స్పందించలేదు. సీనియర్ నేత సోమిరెడ్డి లాంటి వారు ఎవరికి వారు సీట్ల గురించి ప్రకటన చేసుకోవటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేసారు. నెల్లూరులోని ఇద్దరు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు ఆనం..కోటంరెడ్డి టీడీపీ నుంచే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారనే ప్రచారం ఉన్నా..స్థానికంగా మాత్రం ఆ ఇద్దరికీ టీడీపీ నేతల నుంచి మద్దతు లభించటం లేదు.

కార్యకర్తలు ఆందోళన వద్దంటూ..

కార్యకర్తలు ఆందోళన వద్దంటూ..

కోటంరెడ్డి టీడీపీలో చేరిక పైన టీడీపీ నెల్లూరు పార్టీమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ కీలక వ్యాఖ్యలు చేసారు. కోటంరెడ్డి టీడీపీలో చేరిక పైన ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. తాను చంద్రబాబు..లోకేష్ తో చర్చలు చేసిన సమయంలో ఆ ప్రస్తావన రాలేదన్నారు. కోటంరెడ్డిని పార్టీలోకీ తీసుకోవాలని భావిస్తే జిల్లా నాయకత్వంతో చర్చించిన తరువాతనే నిర్ణయం ఉంటుందని చెప్పారు. జిల్లా కు చెందిన నేతలు..కార్యకర్తలు ఈ విషయం పైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. దీంతో..కోటంరెడ్డి వైసీపీని వీడి పార్టీలో చేరినా.. చంద్రబాబు ఆదేశించినా.. క్షేత్ర స్థాయిలో టీడీపీ నేతలు - కేడర్ ఎంత వరకు సహకారం అందిస్తుందనేది ఇప్పుడు కొత్త సందేహాలకు తావిస్తోంది. అదే సమయంలో కోటంరెడ్డి టీడీపీలోకి ఎంట్రీ అధికారికం అయితే.. ఇప్పటి వరకు కోటంరెడ్డి పైన రాజకీయ పోరాటం చేసిన టీడీపీ నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది మరో చర్చ.
కోటంరెడ్డికి ప్రత్యామ్నాయం ఉందా

కోటంరెడ్డికి ప్రత్యామ్నాయం ఉందా


కోటంరెడ్డికి టీడీపీలో ప్రాధాన్యత దక్కుతుందని అనుచరులు భావిస్తున్నారు. వైసీపీలో ఇప్పటి వరకు కోటంరెడ్డి వెనుక ఫాలో అయిన వారు ఎన్నికల సమయానికి ఎంత మంది ఆయనతో నిలుస్తారేది స్పష్టత రావాల్సి ఉంది. ప్రస్తుతం వైసీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా గెలిచిన వారు మెజార్టీ సంఖ్యలో పార్టీకే మద్దతు ప్రకటిస్తున్నారు. కోటంరెడ్డి టీడీపీలో చేరితే..కొద్ది రోజుల క్రితం వరకు ఆయనకు వ్యతిరేకంగా పని చేసిన టీడీపీ శ్రేణులు పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వటం సులువైన విషయం కాదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో టీడీపీ నుంచి వచ్చిన భరోసాతో వైసీపీని దాదాపుగా వీడిన ఎమ్మెల్యే కోటంరెడ్డి..టీడీపీలో ఎదురవుతున్న పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ మార్గం సిద్దం చేసుకుంటున్నారా అనే చర్చ కూడా వినిపిస్తోంది. అయితే, చంద్రబాబు పైన కోటంరెడ్డి పూర్తి భరోసాతో ఉన్నట్లుగా కనిపిస్తోంది. దీంతో..నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయం ఆసక్తిగా మారుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+