మంత్రి లోకేష్ పై కొత్త ఒత్తిడి.. ఆ వీడియోతో టార్గెట్!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ పనిచేయాలని సంకల్పించింది. ముఖ్యంగా ఏపీలో నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన పైన ఎన్నికలకు ముందే భరోసా ఇచ్చిన ఏపీ సర్కార్ నైపుణ్యం పోర్టల్ ద్వారా విద్యార్థులు ఉపాధి అవకాశాలను మెరుగుపరచడానికి ప్రయత్నాలు చేస్తోంది.

జాబ్ క్యాలెండర్ పై లోకేష్ ప్రకటన .. టార్గెట్ చేస్తున్న నిరుద్యోగులు
ఇటీవల కూటమి ప్రభుత్వం ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తుందని రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో మంత్రి లోకేష్ జనవరిలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వెల్లడించారు. ఇది నిరుద్యోగులకు చాలా సంతోషాన్ని కలిగించింది. అయితే జనవరి నెల వచ్చి 17 రోజులు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ విషయంలో అతీగతీ లేకపోవడంతో నిరుద్యోగ యువత సోషల్ మీడియా వేదికగా లోకేష్ ను టార్గెట్ చేస్తున్నారు.

new pressure on minister lokesh over job calender in january

Take a Poll

సోషల్ మీడియాలో లోకేష్ పై పోస్టులతో ఒత్తిడి
రాజమండ్రిలో హలో లోకేష్ కార్యక్రమంలో భాగంగా జాబ్ క్యాలెండర్ పైన కీలక ప్రకటన చేసిన లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని కోరుతూ సోషల్ మీడియా వేదికగా మంత్రి లోకేష్ పై ఒత్తిడిని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారని సోషల్ మీడియా ద్వారా లోకేష్ ను కోరుతున్నారు.

నిరుద్యోగ యువత డిమాండ్ ఇదే
ముఖ్యంగా ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో #JobCalendarNow, #LokeshGiveJobs వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతూ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఉద్యోగ నోటిఫికేషన్లు ఆలస్యం కావడం వల్ల తమ భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతోందని యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. మాటిచ్చినట్టే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్ చేస్తున్నారు.

జాబ్ క్యాలెండర్ ఇస్తారా? చస్తారా?
ఈ పరిణామాలతో మంత్రి లోకేష్‌పై జాబ్ క్యాలెండర్ ప్రకటనతో ఒత్తిడి పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. ఈ నెలలో లోకేష్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోతే ప్రతిపక్షం సైతం ఆయనను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వైసిపి నాయకులు ప్రభుత్వ పని విధానంలో లోపాలను ఎత్తిచూపుతూ అనేక విధాలుగా టార్గెట్ చేస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ మాట్లాడిన వ్యాఖ్యలను, జాబ్ క్యాలెండర్ ప్రకటనను వైరల్ చేస్తూ జాబ్ క్యాలెండర్ ఇస్తారా చస్తారా అంటూ టార్గెట్ చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+