బెజవాడ-ధర్మవరం మధ్య కొత్త రైలు, సురేష్ ప్రభుకు సుజన కితాబు

Posted By:
Subscribe to Oneindia Telugu

విజయవాడ: కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు శుభవార్త. విజయవాడ - ధర్మవరం మధ్య సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రారంభమైంది. ఈ రైలు విజయవాడలో సోమ, బుధ, శనివారం రాత్రి పదకొండు గంటలకు బయలుదేరి ఉదయం గం.10.45ని.లకు ధర్మవరం చేరుకోనుంది.

ధర్మవరం నుంచి మంగళ, గురు, ఆదివారాల్లో సాయంత్రం గం.5.50 నిమిషాలకు బయలుదేరి సోమవారం ఉదయం గం.6.50కి విజయవాడకు చేరుకోనుంది. గుంటూరు, నంద్యాల, అనంతపురంలలో ఈ రైలు ఆగనుంది. కొత్త రైలు ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం జిల్లాలకు ప్రయోజనం.

Also Read: ఏపీ నుంచి రాజ్యసభకు ప్రభు: అమరావతి టు బెంగళూరు హైస్పీడ్ రైల్ లైన్

ఈ రైలు రాయలసీమ ప్రాంతాన్ని, అమరావతిని కలుపుతుంది. విజయవాడ - ధర్మవరం మధ్య వారంలో మూడు రోజులు నడుస్తుంది. ఈ రైలును న్యూఢిల్లీ నుంచి రైల్వే మంత్రి సురేష్ ప్రభు రిమోట్ ద్వారా పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమానికి దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా హాజరయ్యారు.

New train between Vijayawada and Dharmavaram

రైలు నెంబర్ 17215గా విజయవాడలో సోమ, బుధ, శనివారాల్లో రాత్రి 11:10కి కదిలే రైలు గుంటూరు నుంచి 11:55కు, నరసరావుపేట నుంచి అర్ధరాత్రి 12:44కు, వినుకొండ నుంచి 1:19కి, మార్కాపూర్ రోడ్ నుంచి 2:36కు, గిద్దలూరు నుంచి తెల్లవారుజామున 3:46కు, నంద్యాల నుంచి 5:30కి, డోన్ నుంచి ఉదయం 7:10కి, గుత్తి నుంచి 8:17కు, అనంతపురం నుంచి 9:27కు బయలుదేరి ధర్మవరానికి 10:45కు చేరుతుంది.

తిరుగు ప్రయాణంలో ఇదే రైలు 17216 నంబరుతో మంగళ, గురు, ఆదివారాల్లో సాయంత్రం 5:50కి ధర్మవరంలో బయలుదేరి, అనంతపురంకు 6:32కు, గుత్తిలో 7:52కు, డోన్ లో 9:20కి, నంద్యాలలో అర్ధరాత్రి 12:10కి, గిద్దలూరులో 1:51కి, మార్కాపూర్ రోడ్ లో 2:51కి, వినుకొండలో 3:42కు, నరసరావుపేటలో తెల్లవారుజామున 4:15కు, గుంటూరులో 5:40కి కదిలి విజయవాడకు ఉదయం 6:50కి చేరుతుంది.

Also Read: మీరు ఆఫర్ చేశారా, మేం అడిగామా: లోకేష్‌కు పురంధేశ్వరి కౌంటర్

సుజనా చౌదరి థ్యాంక్స్

రైల్వే బడ్జెట్‌లో ఏపీకి ఇచ్చిన హామీలను రైల్వేశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు నెరవేరుస్తున్నారని కేంద్రమంత్రి, తెలుగుదేశం పార్టీ నేత సుజనా చౌదరి అన్నారు. రాష్ట్రానికి మరో కొత్త రైలు కేటాయించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. కాగా, సురేష్ ప్రభు ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లిన విషయం తెలిసిందే.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
New train between Vijayawada and Dharmavaram in Andhra Pradesh.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X