అమరావతి వెళ్లి సాయంత్రానికి రావొచ్చు: జేసీ, టెక్నాలజీతో కొత్త రైలు

Posted By:
Subscribe to Oneindia Telugu

అనంతపురం: అమరావతి - ధర్మవరం మధ్య నడవనున్న కొత్త రైలు బాగుందని, ఇక నుంచి రాత్రిపూట బయలుదేరి రాజధానికి వెళ్లి పనులు చూసుకొని తిరిగి సాయంత్రానికి ఊరికి వచ్చేయవచ్చునని టిడిపి నేత, ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి బుధవారం నాడు వ్యాఖ్యానించారు.

ఆఫ్రికా స్త్రీ హత్య: కస్టడీకి రూపేష్, సానియాకు డీఎన్ఏ పరీక్షలు

రాయలసీమను అమరావతి ప్రాంతానికి కలుపుతూ మంగళవారం ప్రారంభించిన విజయవాడ - ధర్మవరం ఎక్స్ ప్రెస్ రైలు ఈ రోజు ఉదయం గమ్యానికి చేరుకుంది. దీనికి ఎంపీ జేసీ స్వాగతం పలికారు. రైలులోని ప్రతి బోగీనీ పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ... రైలులో ఏర్పాట్లు బాగున్నాయని, సీటింగ్ సౌకర్యవంతంగా ఉందన్నారు. సుఖవంతమైన ప్రయాణం కోసం కొత్త తరహా టెక్నాలజీతో తయారైన బోగీలతో రైలుందని తెలుసుకుని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సీమ ప్రజలు ఇటువంటి రైలు కోసం చానాళ్లుగా ఎదురుచూస్తున్నారన్నారు. రాయలసీమ ప్రాంతంలోని ప్రజల కోరికను తీర్చినందుకు రైల్వే మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.

New train between Vijayawada, Dharmavaram flagged off, JC praises Union Minister

511 కిలోమీటర్ల దూరం ప్రయాణం

ఈ కొత్త రైలు విజయవాడ నుంచి ధర్మవరం వరకు ఉన్న 511 కిమీ పరిధిలో 11 స్టేషన్లలో ఆపనున్నారు. డోన్‌ నుంచి పెండేకల్లు మీదుగా అనంతపురం రానుంది. ప్రయాణదూరం కూడా తక్కువ అవుతుంది. ఈ నెల 14 నుంచి రైలు నిర్దేశిత ప్రయాణ సమయాల మేరకు నడుస్తోంది.

ఈ కొత్త రైలులో తొమ్మిది రిజర్వేషన్‌ బోగీలను ఏర్పాటు చేశారు. ఇందులో 6 స్లీపర్‌ బోగీలు, త్రీ టైర్ బోగీలు రెండు, టూ టైర్‌ బోగీ ఒకటి ఏర్పాటు చేశారు. రిజర్వేషన్‌ బోగీలు తొమ్మిది కొనసాగించనున్నారు. సాధారణ బోగీలు 4 నుంచి 7 వరకు అవసరం మేరకు నడపాలని నిర్ణయించారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The South Central Railway (SCR) has launched Vijayawada-Dharmavaram Tri-Weekly Express train (No.17215) connecting the AP Capital and the Rayalaseema region.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి