తీవ్రవాయుగుండం ఎఫెక్ట్: ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాస్త ఎడతెరిపినచ్చిన వర్షాలు.. మళ్లీ మొదలుకానున్నాయి. నైరుతి రుతుపవనాలు దేశంలోని చాలా ప్రాంతాల నుంచి ఉపసంహరించుకుంటున్నప్పటికీ వర్షాలు కురుస్తన్నాయి. కాగా, శనివారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గంటకు 20 కిలోమీటర్ల వేగంతో వాయువ్య దిశగా ప్రయాణించింది.
Andaman and Nicobar Islands: Light to moderate rainfall at most places with heavy rainfall at isolated places over Andaman & Nicobar Islands on 23rd October. pic.twitter.com/Fe4QqG2Vlq
— India Meteorological Department (@Indiametdept) October 23, 2022
ఈ వాయుగుండం ఆదివారం ఉదయం 8 గంటల 30 నిమిషాలకు పశ్చిమ మధ్య, ఆనుకుని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం మీదగా.. దాదాపు పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యంగా 640 కిలోమీటర్లు, సాగర్ ద్వీపానికి దక్షిణాన 670 కిలోమీటర్లు, బారిసాల్(బంగ్లాదేశ్)కు దక్షిణ - నైరుతి దిశలో 820 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది.

తీవ్ర వాయుగుండం వచ్చే 12 గంటల్లో వాయువ్య దిశగా కదిలి మధ్య బంగాళాఖాతంలో తుఫానుగా బలపడే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అనంతరం వంపు తిరిగి ఉత్తర- ఈశాన్యం వైపు కదిలి అక్టోబరు 25 తేదీ(మంగళవారం) ఉదయానికి టింకోనా ద్వీపం, శాండ్‌విప్ మధ్య బారిసల్ దగ్గర తీరాన్ని దాటుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.
దీని ప్రభావంతో ఆదివారం నుంచి మూడురోజుల పాటు ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల వెంబడి మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక, ఆంధ్రప్రదేశ్, యానంలో దిగువ ట్రోపో ఆవరణములో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. ఏపీలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
Depression over eastcentral Bay of Bengal intensifiedinto a Deep Depression about 580 km northwest of Port Blair. To intensify into a cyclonic storm over central Bay of Bengal. To cross Bangladesh coast between Tinkona Island and Sandwip around 25th October early morning. pic.twitter.com/R5Q45bQHFE
— India Meteorological Department (@Indiametdept) October 23, 2022
ఆదివారంనాడు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాంలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పలుచోట్ల కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. సోమ, మంగళవారాల్లో చాలా ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉండనుంది.
దక్షిణ కోస్తాంధ్రలో ఆదివారం పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది. మరోవైపు, రాయలసీమలోనూ ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. సోమ, మంగళవారాల్లో చాలా ప్రాంతాల్లో పొడిగా వాతావరణం ఉండనుంది.












Click it and Unblock the Notifications