• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

నవరత్నాలకు నిధుల కొరత..! ఏపీ సీఎం జగన్ లక్ష్యం అదేనా..?

|

అమరావతి/హైదరాబాద్ : ఏపి యువ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా భావించిన నవరత్నాల పథకాలకు ఆర్థిక పరిస్థితి శరాఘాతంలా మారింది. ప్రజోపయోగ్యమైన తొమ్మిది వినూత్న పథకాలను 2018లో మంగళగిరి ప్లీనరీ సమావేశాల్లో జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. అంతేకాకుండా వాటికి తాను చేస్తున్న పాదయాత్రలో విస్తృత ప్రాచుర్యం కల్పించారు జగన్. పార్టీ అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాల అమలు ద్వారా అన్ని వర్గాల సత్వర అభివృద్ది తధ్యమని పలు సందర్బాల్లో స్పష్టం చేసారు.

నాకు శత్రువులు ఎక్కువ: ఇంగ్లీషు మీడియంలో ముందుకే.. సిగ్గుతో తలదించుకోవద్దు: సీఎం జగన్ స్పష్టీకరణ!

ఏపి సీఎం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు.. !

ఏపి సీఎం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన నవరత్నాలు.. !

ఆరేళ్ల పిల్ల వాడి దగ్గర నుండి 60 ఏళ్ల వయసు వారికి నవరత్నాల పథకాల వల్ల ఖచ్చింతంగా లబ్ది జరుగుతుందని పేర్కొన్నారు. అయితే అధికాంలోకి వచ్చిన తర్వాత ఈ పథకాలు ఆచరణకు నోచుకోవడం లేదు. అందుకు రాష్ట్ర ఆర్దిక పరిస్ధితి గుదిబండగా మారడమే కారణంగా తెలుస్తోంది. వృద్ధాప్య పింఛన్, నూతన ఉద్యోగాలు, అమ్మ ఒడి, ఆటో కార్మికులకు జీవిత భీమా, జీత భత్యాలు, ఆరోగ్య శ్రీ లాంటి వాటికి రాష్ట్ర ఖజానా సరిపోతుండడంతో నవరత్నాల్లాంటి నూతన పథకాల అమలుకు నిధులు సరిపోవడంలేదనే చర్చ జరుగుతోంది. అందుకోసం ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డి వినూత్న అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.

నవరత్న పథకాలకు నిధుల కొతర..!

నవరత్న పథకాలకు నిధుల కొతర..!

ఎన్నికల మేనిఫెస్టోతో పాటు పాదయత్ర చేస్తున్నప్పుడు పలు సందర్బాల్లో చెప్పిన నవరత్నాల అమలు ఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డికి భారంగా పరిణమించాయి. నవరత్నాల అమలు కోసం జగన్ రాష్ట్ర ప్రజలపై మరింత ఆర్థిక భారం మోపుతారని అంతా భావిస్తున్న తరుణంలో మరో కీలక నిర్ణయం తీపుకోవడానికి సీఎం జగన్ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. నవరత్నాల అమలు కోసం ఏకంగా ప్రభుత్వ ఆస్తులను విక్రయించడానికి సిద్దపడుతున్నట్టు సమాచారం. నవరత్నాలకు నిధుల సమీకరణ కోసం విలువైన ప్రభుత్వ స్థలాలు, భూముల అమ్మకానికి జగన్ ప్రభుత్వం సిద్ధమవుతోందనే చర్చ జరుగుతోంది.

నిరుపయోగంగా ఉన్న ఆస్తుల విక్రయానికి ప్రభుత్వ యోచన..!

నిరుపయోగంగా ఉన్న ఆస్తుల విక్రయానికి ప్రభుత్వ యోచన..!

ఏపీ ఇప్పటికే సుమాను రెండు లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉన్న రాష్ట్రం, నవరత్నాల అమలు కోసం ఆదాయ వనరులను అన్వేషిస్తోంది. అందులో భాగంగానే నిరర్థకంగా ఉన్న విలువైన స్థలాలు, భూములను అమ్మేయాలనే యోచనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఎకరం నుంచి నాలుగు ఎకరాల విస్తీర్ణం ఉన్న అతిథి గృహాల జాబితా, ఇతర భూముల వివరాలను అందజేయాలని రెవెన్యూ శాఖను ప్రభుత్వం ఆదేశించినట్టు సమాచారం. నిరుపయోగంగా ఉన్న స్థలాలు, భూములు, ప్రభుత్వ కార్యాలయాలు, అతిథి గృహాల స్థలాలన్నింటినీ అమ్మేసేందుకు జగన్‌ సర్కార్‌ సన్నాహాలు చేస్తోందని విపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

  Pawan Kalyan Expresses His Support To Chandrababu's Deeksha On Sand Shortage
  విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు..!

  విమర్శిస్తున్న ప్రతిపక్ష పార్టీలు..!

  ఏపి నవనిర్మాణం (బిల్డ్‌ ఏపీ) పేరుతో ప్రభుత్వ ఆస్తుల విక్రయానికి సిద్ధమవుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజధాని విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంతో పాటు ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌ అతిథి గృహాలు కూడా విక్రయ ఆస్తుల జాబితాలో ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. అయితే, వైసీపీ వర్గాలు మాత్రం దీన్ని ఖండిస్తున్నాయి. నిరర్థక ఆస్తుల సద్వినియోగం కోసమే ఆ వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటోందని వివరణ ఇస్తోంది ప్రభుత్వం. ఇదే అశం పట్ల మరో రెండు మూడు వారాల్లో స్పష్టత రానున్నట్టు తెలుస్తోంది.

  English summary
  The economic situation has become a disaster for the ambitious navratna schemes of the AP, Young Chief Minister Ys Jagan Mohan Reddy. It is being discussed that the government is preparing for sale of valuable public places and land for funding the Navratna scheems.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X