టీడీపీ ఆఫీసులో జగన్ ఎయిర్ పోర్ట్ ఘటన డాక్టర్..! అసలేం జరిగిందంటే?

ఏపీలో ఎన్నికలు ముగించుకుని సీఎం వైఎస్ జగన్ నిన్న విజయవాడ ఎయిర్ పోర్టు నుంచి లండన్ కు బయలుదేరుతున్న సమయంలో ఒక్కసారిగా కలకలం రేగింది. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎం జగన్ వచ్చిన సమయంలో ఆయనకు సమీపంగా వచ్చినట్లు చెప్తున్న ఎన్నారై డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎయిర్ పోర్టులో వీఐపీ మూమెంట్ ఉన్న సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నారనే కారణంతో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ విషయం బయటికి రావడంతో పోలీసులు ఉదయం స్పందించారు. గన్నవరం ఎయిర్ పోర్టులో అమెరికా నుంచి వచ్చిన ఎన్నారై డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నామని, అయితే అనారోగ్యంగా ఉందని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అయితే లోకేష్ ను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, కిడ్నాప్ చేశారని, వేధించారని, చివరకు ఆయన అనారోగ్యం పాలవ్వడంతో ఆస్పత్రిలో చేర్చారనే ప్రచారం జరిగింది.

nri doctor detained in ys jagan s gannavaram airport incident released explain what happened

ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం డాక్టర్ ఉయ్యూరు లోకేష్ కుమార్ టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఆయనతో పాటు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు పార్టీ నాయకులు మన్నవ సుబ్బారావు, దారపనేని నరేంద్రబాబు, చిలక బసవయ్య, న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ ఉన్నారు. ప్రవాసాంధ్రుడు డాక్టర్ ఉయ్యూరు లోకేష్ ను జగన్ సర్కార్ పోలీసుల సాయంతో కిడ్నాప్ చేయించి ఆ తర్వాత విడుదల చేసిందని వారు తెలిపారు.

nri doctor detained in ys jagan s gannavaram airport incident released explain what happened

గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన తనపై పోలీసులు దాడి చేశారని ఉయ్యూరు లోకేష్ తెలిపారు. జగన్ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించినందుకే వారు ఎయిర్ పోర్టులో తనను గుర్తుపట్టి అదుపులోకి తీసుకున్నారని, ఆ తర్వాత దాడి చేశారన్నారు. ఛాతీ నొప్పి వస్తుందని చెప్పినా వినకుండా వేధించారన్నారు. అమెరికన్ పౌరుడైన తపై పోలీసులు, అధికారులు దౌర్జన్యంగా వ్యవహరించారన్నారు. దీనిపై ఎంబసీతో పాటు ఉన్నతాధికారులకూ ఫిర్యాదు చేశామన్నారు. తనను వేధించిన పోలీసులపై చర్యలు తీసుకునేవరకూ పోరాడతానని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+