ఏపీలో అఫీషియల్ వాట్సప్ గ్రూప్ లో న్యూడ్ వీడియోలు.. షాక్ లో అధికారులు!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చిత్తూరు జిల్లా సమాచార శాఖ అధికారిక వాట్సప్ గ్రూపులలో న్యూడ్ వీడియోలు ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఐ అండ్ పి ఆర్ డిప్యూటీ డైరెక్టర్ ఫోన్ నుండి అధికారిక వాట్సప్ గ్రూప్ లలోకి నగ్న వీడియోలు రావడంతో గ్రూప్ లో ఉన్న అధికారులంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.

సమాచార శాఖా డిప్యూటీ డైరెక్టర్ వాట్సప్ గ్రూప్ లో అశ్లీల వీడియోలు
వెంటనే అలర్ట్ అయిన డిప్యూటీ డైరెక్టర్ తన ఫోన్ హ్యాక్ చేసి ఈ అశ్లీల వీడియోలు పెట్టినట్టు గుర్తించి వెంటనే పోలీసులను ఆశ్రయించారు. తన ఫోన్ హ్యాక్ అయిందని సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వ్యవహారం పైన విచారణ జరుపుతున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి.

Nude videos in I and PR official WhatsApp group in Andhra Pradesh officials are in shock

సైబర్ నేరాలపై అవగాహన, అప్రమత్తత అవసరం
సైబర్ నేరాలపైన అవగాహన లేకపోతే, అప్రమత్తంగా లేకపోతే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లను హ్యాక్ చేయడంతో పాటు, వాట్సప్ అకౌంట్లను, వాట్సప్ గ్రూపులను కూడా హ్యాక్ చేస్తున్నారు. అంతేకాదు ఇన్స్టా పేజ్ లను సైతం హ్యాక్ చేస్తూ ఏ చిన్న అవకాశం దొరికినా డబ్బులు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక పండుగలు, ఏవైనా ప్రత్యేకసందర్భాలను కూడా వదలకుండా జనాలను నమ్మించి మోసగించే ప్రయత్నం చేస్తున్నారు.

అలెర్ట్ చేస్తున్న సైబర్ క్రైం పోలీసులు
సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారిని సైతం వదిలిపెట్టకుండా వారి అకౌంట్స్ ను హ్యాక్ చేస్తున్నారు. పోలీస్ అధికారులు, కలెక్టర్లు సైతం సైబర్ క్రిమినల్స్ బారిన పడ్డారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే సైబర్ నేరాల విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, మొబైల్ ఫోన్ కి వచ్చే ప్రతి లింకును ఓపెన్ చేయకూడదని చెబుతున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు.

సైబర్ నేరాల విషయంలో తస్మాత్ జాగ్రత్త
మొబైల్ ఫోన్లలో బ్యాంకు ఖాతాలకు సంబంధించి కానీ, వ్యక్తిగతమైన సెన్సిటివ్ కంటెంట్ ను ఉంచుకో కూడదని హెచ్చరిస్తున్నారు. సైబర్ నేరగాళ్ల చేతికి డేటా చేరితే అనవసరంగా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెబుతున్నారు. కనుక సైబర్ నేరాల విషయంలో అందరూ తస్మాత్ జాగ్రత్త .

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+