వృద్ధురాలి హత్య: వాలంటీర్స్ వండర్స్-ఎపిసోడ్ ఇన్ఫినిటీ: టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వృద్ధురాలిని వాలంటీర్ హత్య చేసిన దారుణ ఘటన విశాఖలో చోటుచేసుకుంది. విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ లో చోటు చేసుకున్న ఈ ఘటనలో వరలక్ష్మి అనే వృద్ధురాలిని అక్కడ వాలంటీర్ గా పని చేస్తున్న వెంకటేష్ అనే వ్యక్తి దారుణంగా హతమార్చాడు.
హత్యకు గురైన 73 సంవత్సరాల వృద్ధురాలు వరలక్ష్మి నిర్వహిస్తున్న షాపులో, గత కొంతకాలంగా పార్ట్ టైం వర్కర్ గా వెంకటేష్ పని చేస్తున్నాడు. నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆమెను వెంకటేష్ హతమార్చాడు. విషయం తెలిసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వరలక్ష్మీ ముఖంపై దిండుతో అదిమి ఊపిరాడకుండా చేసి ఆమెను హత్య చేసినట్టుగా క్లూస్ టీం ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చింది.

నిన్న రాత్రి వృద్ధురాలి ఇంటికి వెంకటేష్ వచ్చి వెళ్లినట్టు సీసీ కెమెరాల్లో రికార్డయింది. పెందుర్తి పోలీసులు ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ తో ఆధారాలను సేకరిస్తున్నారు. ఆమె ఒంటిపై ఉన్న బంగారం కోసమే వెంకటేష్ ఈ హత్య చేసినట్టుగా భావిస్తున్నారు. నిందితుడిని పట్టుకోవడం కోసం పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు.
వాలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ♾️
— JanaSena Shatagni (@JSPShatagniTeam) July 31, 2023
పెందుర్తి లో 72 ఏళ్ల వృద్ధురాలి ని బంగారం కొట్టేయడం కోసం హత్య చేసిన "వాలంటీర్ వెంకట్", @YSRCParty నాయకుల స్పూర్తితో హత్య చేశాడా మీ సేవారత్న @ysjagan ?#HelloAP_ByeByeYCP #HelloAP_WelcomeJSP pic.twitter.com/aVj7xAS2Gs
ఇదిలా ఉంటే మృతురాలిని హతమార్చిన వెంకటేష్ వైసిపి ప్రభుత్వం నియమించిన గ్రామ వాలంటీర్ కావడంతో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతుంది. తాజాగా జనసేన నాయకుడు చేసిన ఒక పోస్ట్ ని రీ ట్వీట్ చేసిన పవన్ కళ్యాణ్ సైతం వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
వాలంటీర్స్ వండర్స్ - ఎపిసోడ్ ఇన్ఫినిటీ అంటూ, వాలంటీర్స్ చేసేవి అనంతమని పేర్కొన్నారు. పెందుర్తి లో 72 ఏళ్ల వృద్ధురాలిని బంగారం కొట్టేయడం కోసం హత్య చేసిన "వాలంటీర్ వెంకట్", అంటూ వాలంటీర్లను మళ్ళీ టార్గెట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల స్ఫూర్తితో హత్య చేశాడా మీ సేవ రత్న.. వైయస్ జగన్ సమాధానం చెప్పాలంటూ ప్రశ్నించారు. జగన్ మాట్లాడిన వీడియో కు తాజాగా జరిగిన దారుణ ఘటన వీడియో లింక్ చేసి పోస్ట్ చేశారు.
-
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications