యువతికి గార్డ్ వేధింపులు, మోసం చేశాడని మరోచోట..

One youth arrested by Punjagutta police
హైదరాబాద్/వరంగల్: కొంతకాలంగా యువతిని వేధిస్తున్న యువకుడిని పంజాగుట్ట పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇరవై నాలుగేళ్ల యువకుడు హైదరాబాదులో ఉంటున్నాడు. అతన సోమాజిగూడలోని ఓ ప్రయివేటు సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

అక్కడే మరో సంస్థలో పని చేస్తున్న ఓ యువతిని కొంతకాలంగా మానసికంగా వేధిస్తున్నాడు. రెండు రోజుల క్రితం ఆమెపై అతను దాడికి కూడా యత్నించాడు. అతని వేధింపులు ఎక్కువయ్యేసరికి సదరు యువతి పోలీసులను ఆశ్రయించారు. దపంజాగుట్ట పోలీసులు ఫిర్యాదు నమోదు చేసుకొని అతనిని అరెస్టు చేశారు.

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

ప్రేమ వివాహం చేసుకున్న ఓ జంట తమ కుటుంబ సభ్యుల నుండి రక్షణ కావాలంటూ సరూర్ నగర్ పోలీసులను ఆశ్రయించింది. నల్గొండ జిల్లా చిట్యాలకు చెందిన నరేష్ ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నాడు. కర్మన్ గాట్లో ఉంటున్నాడు. మిర్యాలగూడకు చెందిన ప్రణీతతో ఆరేళ్లుగా ప్రేమలో ఉన్నాడు. ఇటీవల వారు ఆర్యసమాజ్‌లో పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల నుండి హామీ ఉందంటూ వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోసం చేశాడని...

వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం కరుణాపురానికి చెందిన ఓ యువతి... ఘటకేసర్‌కు చెందిన అచ్చయ్య అనే యువకుడు ప్రేమించి మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. కరుణాపురానికి చెందిన యువతి ఘటకేసర్లో కొద్ది రోజులు పని చేసింది. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన అచ్చయ్యతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకుంటానని అతను మోసం చేశాడని ఆమె ఫిర్యాదు చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+