గర్భిణికి ఆపరేషన్‌:కత్తులు తుప్పు పట్టాయని...మధ్యలో ఆపేశారు

Posted By: Suvarnaraju
Subscribe to Oneindia Telugu

పశ్చిమ గోదావరి: ప్రభుత్వాసుపత్రుల్లో పేరుకుపోయిన నిర్లక్ష్యానికి అద్దం పట్టే మరో ఘటన ఇది. వింటేనే మన ప్రభుత్వ సంస్థలు పనితీరు మీద...సిబ్బంది నిర్లక్ష్యం మీద ఏవగింపు కలిగించే వాస్తవ ఉదంతమిది.

చికిత్స నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్ కు వచ్చిన ఓ నిండు గర్భిణీకి అత్యవసరంగా ఆపరేషన్ ఆపరేషన్‌ చెయ్యాల్సి వచ్చింది. డాక్టర్లు కూడా ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. ఆమెకి మత్తు మందిచ్చి సర్జరీకి సిద్దం చేశారు. తీరా సర్జరీ మొదలు పెట్టబోయే సమయానికి ఆపరేషన్ చేసే కత్తులు తుప్పు పట్టి ఉన్నాయని గుర్తించారు. వాటితో ఆపరేషన్ చేస్తే తల్లీబిడ్డల ప్రాణాలకి చాలా ప్రమాదమని తెలిసి ఆపరేషన్ మధ్యలోనే ఆపేశారు. అపస్మారక స్థితిలో ఉన్న ఆ గర్భిణీని ఆపరేషన్ కోసం మరో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో చోటుచేసుకుంది...వివరాల్లోకి వెళితే...

 Operation stopped in the middle...because of rusted knives

ఆకివీడుకు చెందిన కొమరిన రూపాదేవి నిండు గర్భిణి. సోమవారం స్థానిక ప్రభుత్వాస్పత్రి డెలివరీ నిమిత్తం వచ్చిన ఆమెను వైద్యురాలు మాధవీకల్యాణి పరీక్షించారు. కడుపులో బిడ్డ అడ్డం తిరిగిందని, వెంటనే ఆపరేషన్‌ చేయాలని ఆమె చెప్పారు. దీంతో ఆమెకు ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. సర్జరీ కోసమని
రూపాదేవికి ఎనస్తీషియా కూడా ఇచ్చారు.

సర్జరీకి సిద్దమైన వైద్యులు ఆపరేషన్‌ ప్రారంభించబోయే చివరి నిమిషంలో సర్జరీ చేయాల్సిన కత్తులు తుప్పు పట్టాయని గుర్తించారు. ఆ కత్తులతో ఆపరేషన్ చేస్తే పేషెంట్ తో పాటు ఆమె కడుపులోని బిడ్డకు ఈ తుప్పుపట్టిన కత్తుల కారణంగానే ప్రమాదం వాటిల్లవచ్చనే గ్రహింపుతో ఆమెను భీమవరం తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో ఈ విషయమై రూపాదేవి బంధువులు వైద్యులపై మండిపడ్డారు. అయితే వైద్యులు...ఇందులో తమ తప్పేంలేదని...ఆస్పత్రిలో వారం క్రితం ఓ ఆపరేషన్‌ చేశామని, అప్పుడు కత్తులను శుభ్రం చేయాల్సిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అవి తుప్పు పట్టిపోయాయని చెబుతున్నారు...ఈ సమాధానంతో పేషెంట్ బంధువులు చేసేదేంలేక తమ ప్రారబ్ధాన్ని...ప్రభుత్వాసుపత్రుల పనితీరును తిట్టుకొంటూ వేరే ఆస్పత్రికి బయలుదేరి వెళ్లిపోయారు.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A Government Hospital was thrown into a state of chaos following a operation stopped when doctors noticed that the surgery knives had been rusted. The incident took place in Akiveedu, west Godavari district.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి