రాజకీయనాయకులకు పల్నాడు ఎస్పీ మలికా గార్గ్ వార్నింగ్.. పోలీస్ అధికారులకు హెచ్చరిక!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ వేళ, పోలింగ్ తర్వాత అనేక ప్రాంతాలలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లా దాడులతో అట్టుడికి పోయింది. టిడిపి, వైసిపి వర్గాల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు హింసాత్మకంగా మారి పల్నాడులో శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. పల్నాడులో పోలింగ్ రోజు మాత్రమే కాదు, ఆ తర్వాత కూడా చోటు చేసుకున్న దాడులతో అక్కడ శాంతిభద్రతలు అదుపుతప్పాయి.
పల్నాడు ఎస్పీపై వేటు వేసిన ఈసీ
కర్రలు, రాళ్లు, రాడ్లు, కత్తులు పెట్రోల్ బాంబులు, నాటు బాంబులతో ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో దాడుల్లో చాలా మందికి గాయాలయ్యాయి. పల్నాడు రక్తసిక్తమైంది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు భారీగా ధ్వంసమయ్యాయి. పల్నాడులో శాంతి భద్రతలను కాపాడి, అల్లర్లను కంట్రోల్ చేయడంలో జిల్లా పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందడంతో ఈసీ జిల్లా ఎస్పీపై వేటు వేసింది.

పల్నాడు ఎస్పీగా మలికా గార్గ్
పల్నాడు లో జరిగిన ఘటనలపై సిట్ దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో సిట్ బృందం రెండు రోజులుగా పల్నాడులో పర్యటించి అక్కడ ఘర్షణలపై విచారణ జరిపి నివేదిక తయారుచేసి డీజీపీకి అందించింది. పల్నాడు ఎస్పి బిందు మాధవ్ పై ఎన్నికల సంఘం సస్పెన్షన్ వేటు ఆమె స్థానంలో నూతనంగా మహిళా ఐపీఎస్ అధికారిణి మలికా గార్గ్ నేడు బాధ్యతలను చేపట్టారు.
పల్నాడులో శాంతి భద్రతలు అదుపు తప్పాయి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జూన్ 4వ తేదీన సజావుగా కౌంటింగ్ సాగేలా చూడటం నా మొదటి లక్ష్యమని మలికా గార్గ్ పేర్కొన్నారు. ప్రస్తుతం జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ పైన ప్రధానంగా దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని ఘటనల వల్ల పల్నాడులో శాంతిభద్రతలు అదుపుతప్పాయి అని పేర్కొన్న ఆమె రాజకీయ పార్టీల నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు.
రాజకీయ పార్టీల నాయకులకు ఎస్పీ వార్నింగ్
రాజకీయ నాయకులు లా అండ్ ఆర్డర్ ను గౌరవించాలని సూచించిన ఎస్పీ, రాజకీయ పార్టీల నాయకులు చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పల్నాడు జిల్లాలో ప్రశాంతత నెలకొల్పటానికి తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. పోలీస్ అధికారులు తప్పు చేస్తే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చర్యలు తప్పవని మలికా గార్గ్ వార్నింగ్ ఇచ్చారు.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications