వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ రెండింటి కోసం పట్టుబడుతున్న తల్లీకొడుకులు

|
Google Oneindia TeluguNews

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగా సమయముంది. కానీ ప్రధాన పార్టీల అధినేతలతోపాటు సీనియర్ నేతలు కూడా ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్దపడుతున్నారు. అవసరమైన అస్త్రశస్త్రాలను సమకూర్చుకుంటున్నారు. వారిలో తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత పరిటాల సునీత ఒకరు.

సునీత పాదయాత్ర

సునీత పాదయాత్ర

ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో సునీత కొద్దిరోజులుగా పాదయాత్ర చేస్తున్నారు. నియోజకవర్గం మొత్తం "రైతు కోసం పాదయాత్ర" పేరుతో భారీగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. కొద్దిరోజుల నుంచి ఆమె పాదయాత్ర ద్వారా నియోజకవర్గం మొత్తం కలియతిరుగుతున్నారు. ఈ యాత్ర రాప్తాడు నియోజకవర్గానికే పరిమితమని ఆమె స్పష్టం చేశారు. రైతు సమస్యలను పరిష్కరించకుండా మీనమేషాలు లెక్కపెడుతున్న ముఖ్యమంత్రి పనితీరువల్ల ఆరుగాలం శ్రమించే అన్నదాతలకు కనీస మద్దతు ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. పాదయాత్రద్వారా నియోజకవర్గంలోని ప్రజలందరినీ కలిసినట్లుంటుందని, వారి అభిప్రాయాలు, ఆకాంక్షల మేరకు హామీలిస్తే గెలుసు సులభమని ఆమె భావిస్తున్నారు.

రెండు సీట్లు అడుగుతున్న పరిటాల కుటుంబం

రెండు సీట్లు అడుగుతున్న పరిటాల కుటుంబం

గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల సునీత కుమారుడు శ్రీరాం పోటీచేసి ఓటమిపాలయ్యారు. వచ్చే ఎన్నికల్లో తన తనయుణ్ని గెలిపించుకోవడానికి పాదయాత్ర చేస్తున్నారా? అనే సందేహం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే శ్రీరాం మాత్రం ధర్మవరం నియోజకవర్గంలో పాగా వేశారు. రాజకీయంగా తన బలాన్ని అక్కడి నుంచి చాటుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో శ్రీరాం ధర్మవరం సీటును అడిగారు. మరోవైపు రాప్తాడు నుంచి పరిటాల సునీత పోటీచేస్తుందని చెప్పారు. కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఇస్తానని అధినేత స్పష్టం చేశారు. అయినప్పటికీ రాప్తాడులో సునీత పాదయాత్ర చేస్తుండటంతోపాటు శ్రీరాం ధర్మవరంలో పాగా వేశారు. పాదయాత్రకు లభిస్తున్న స్పందనపట్ల సునీత సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కుటుంబానికి ఒకసీటే అంటున్న చంద్రబాబు

కుటుంబానికి ఒకసీటే అంటున్న చంద్రబాబు

రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబానికి ఒక సీటేనని చంద్రబాబు ప్రకటించారు. ఈ కోవలో యనమల కుటుంబం,కేఈ కుటుంబం, పరిటాల కుటుంబంతోపాటు ఇతర సీనియర్ నేతల కుటుంబాలున్నాయి. అయినప్పటికీ వీరంతా రెండు స్థానాల కోసం చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. చివరకు కుటుంబానికి ఒకటే ఇస్తారా? లేదంటే ఒత్తిడికి తలొగ్గి కుటుంబానికి రెండు సీట్లు కేటాయిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

English summary
Sunitha has been on a padayatra for the past few days in the Raptadu constituency of the joint Anantapur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X