Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కాళ్ళు మొక్కి ,పాలాభిషేకం చేస్తా, ఫోటో మెడలో వేసుకు తిరుగుతా .. పోసాని సంచలనం

Recommended Video

    AP Assembly Election 2019 : వాటిని నిరూపిస్తే నేను ఏం చెయ్యటానికి అయినా సిద్ధం : పోసాని | Oneindia

    ఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. నేతల మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకర్ని మించి ఒకరు ఆరోపణలు , ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. తాజాగా పోసాని కృష్ణ మురళి జగన్ పార్టీ కి సపోర్ట్ గా పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు . పవన్ చంద్రబాబుతో కుమ్మక్కై ఎలాంటి ఆధారాలు లేకుండా జగన్ ను విమర్శిస్తున్నారని పోసాని కృష్ణ మురళి ఫైర్ అయ్యారు .

    పవన్ పై ఫైర్ అయ్యిన పోసాని .. జగన్ పై ఆరోపను నిరూపిస్తే పాలాభిషేకం చేస్తా

    పవన్ పై ఫైర్ అయ్యిన పోసాని .. జగన్ పై ఆరోపను నిరూపిస్తే పాలాభిషేకం చేస్తా

    విలక్షణ నటుడు పోసాని కృష్ణమురళి ఎప్పుడు ఏది మాట్లాడినా అది సెన్సేషన్ అవుతుంది. తాజాగా ఆయన పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు . జగన్‌పై పలు ఆరోపణలు చేస్తున్న పవన్ కళ్యాణ్, వాటిని నిరూపిస్తే తాను ఏమి చెయ్యటానికి అయినా సిద్ధం అని ప్రకటించారు. అంతే కాదు పవన్ కళ్యాణ్ జగన్ పై చేస్తున్న ఆరోపణల్లో నిజం వుందని తేలితే తాను ఆయన కాళ్లకు నమస్కరించి, పాలాభిషేకం చేస్తానని సంచలన వ్యాఖ్య చేశారు .

    పవన్ ఫోటో మెడలో వేసుకు తిరుగుతానన్న పోసాని

    పవన్ ఫోటో మెడలో వేసుకు తిరుగుతానన్న పోసాని

    అంతటితో ఊరుకోక జగన్ అవినీతిపై ఆధారాలు ఇస్తే, తన ఇంట్లో ఉన్న జగన్ బొమ్మ తీసేసి పవన్ ఫోటోను పెట్టుకుంటానన్నారు. అంతే కాదు అవసరం అనుకుంటే పవన్ ఫోటో మెడలో వేసుకు తిరుగుతా అన్నారు . జగన్ చాలా గొప్ప వ్యక్తని, క్యారెక్టర్ ఉన్న మనిషని, ఆయనను పవన్ ఎందుకు అపార్థం చేసుకున్నారో తెలియడం లేదని వ్యాఖ్యానించిన పోసాని చేసిన వ్యాఖ్యలు చాలా ఆసక్తికరంగా మారాయి.

    లోకేష్ పైనా , ఓ పత్రికాధినేతపైనా నిప్పులు చెరిగిన పోసాని

    లోకేష్ పైనా , ఓ పత్రికాధినేతపైనా నిప్పులు చెరిగిన పోసాని

    ఒక్క పవన్ కళ్యాణ్ పైనే కాదు లోకేష్ పైన , ఒక మీడియా అధినేతపైనా పోసాని ఘాటు విమర్శలు చేశారు . లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయనకు డబ్బు, మందు, అమ్మాయిలు తప్ప మరో ధ్యాస లేదంటూ కొన్ని పాత ఫోటోలను మీడియా ముందు ప్రదర్శించారు. అలాగే జగన్‌ గానీ ఇదే తరహాలో ఫోటోలో ఉండి,ఆ మీడియా అధినేతకు దొరికుంటే, సదరు పత్రిక ఫ్రంట్ పేజీలో ప్రతిరోజూ వేసుండేవారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు పోసాని కృష్ణమురళి .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+