పవన్ కళ్యాణ్ బ్రో సినిమా కలెక్షన్ల సునామీ; 3రోజుల్లో ఎన్ని కోట్లంటే!!

సినిమా ఏదైనా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించారు అంటే ఆ క్రేజే వేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబోలో సముద్రఖని దర్శకత్వంలో రీమేక్ చేసిన చిత్రం బ్రో మూడు రోజుల క్రితం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రిలీజైన నాటినుండి కలెక్షన్లతో రికార్డు బద్దలు కొడుతూ బ్రో సినిమా దూసుకుపోతోంది.

ప్రేక్షకులతో థియేటర్లు అన్ని కిక్కిరిసి పోతున్నాయి. మంచి మెసేజ్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ను బద్దలు కొడుతుంది. కలెక్షన్ల సునామీని సృష్టిస్తోంది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే 100 కోట్ల వరకు వసూలు చేసింది అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అది అని కచ్చితంగా ఒప్పుకోవాల్సిందే.

Pawan Kalyan bro movie collections tsunami; near 100 crores in 3 days!!

సినీ రంగంలోనే కాక రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ తీసిన అనేక సినిమాలు వర్తమాన రాజకీయాలను ప్రతిబింబించేలా సాగుతున్నాయి. వర్తమాన రాజకీయాల్లోని అనేక పాత్రలను సినిమాలలో ప్రతిబింబిస్తూ పవన్ కళ్యాణ్ చిత్రాలు సాగుతున్నాయి. ఇక బ్రో సినిమాలో కూడా అనేక రాజకీయపరమైన సీన్లు, పవర్ఫుల్ పంచ్ లు, పాటలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నాయి.

దీంతో ఈ సినిమాను చూసే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సినిమాపై అదిరిపోయే రివ్యూలు, అలాగే మంచి టాక్ కూడా రావడంతో బ్రో సినిమాకు జనాలు క్యూ కడుతున్నారు. దీంతో బ్రో సినిమాకు కలెక్షన్ల సునామీ కొనసాగుతుంది. మూడు రోజుల్లో 100కోట్ల వరకు వసూలు చేసిన బ్రో సినిమా నైజాంలో 30కోట్లు, ఆంధ్రాలో 37.30కోట్లు, సీడెడ్ లో 13.20కోట్లు, ఓవర్సీస్ లో 12కోట్ల రూపాయలను వసూలు చేసింది.

మొత్తంగా తెలుగు రాష్ట్రాలలో 80.50 కోట్లను వసూలు చేసింది. కర్ణాటక తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది. మొత్తంగా తొలి మూడు రోజుల్లో 97.5 కోట్లను వసూలు చేసి రికార్డు సృష్టిస్తూ బ్రో సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. బ్రో సినిమా సూపర్ డూపర్ హిట్ అన్న టాక్ రావడంతో రాబోయే రోజుల్లో ముందు ముందు మరింత భారీ కలెక్షన్లు వస్తాయని అంచనా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+