హీరోల ఓట్ బ్యాంక్ పై పవన్ గురి - "అన్నయ్య" మద్దతు వద్దా, అక్కడే ట్విస్ట్..!!

జనసేనాని పవన్ కల్యాణ్ ఓట్ బ్యాంకుల పై గురి పెట్టారు. గోదావరి జిల్లాలను ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని పవన్ తన వారాహి యాత్ర ప్రారంభించారు. ఈ యాత్రలో ప్రత్యేకంగా సినీ హీరోల పేర్లు పదే పదే ప్రస్తావన చేస్తున్నారు. ప్రభాస్..మహేశ్ తన కంటే పెద్ద హీరోలు అంటూ వ్యాఖ్యానించటం ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది. ఇదే సమయంలో చిరంజీవి..బాలయ్య..రామ్ చరణ్..జూ ఎన్టీఆర్ పేర్లను ప్రస్తావించారు. పవన్ వీరి మద్దతు కోరుతున్నట్లు స్పష్టం అవుతోంది.

పవన్ కామెంట్స్ వైరల్ : పవన్ కల్యాణ్ హీరోల పైన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తనకు అందరు హీరోలు ఇష్టమంటూ జూనియర్ ఎన్టీఆర్..మహేశ్ బాబు..అల్లు అర్జున్..రామ్ చరణ్..చిరంజీవి..బాలయ్య ఇలా అందరి పేర్లను చెప్పుకొచ్చారు. వీరంతా తనకు ఇష్టమని..అందరి సినిమాలు చూస్తానని చెప్పుకొచ్చారు. ప్రభాస్..మహేశ్ తనకంటే పెద్ద హీరోలని పేర్కొన్నారు.

రామ్ చరణ్..జూ ఎన్టీఆర్ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారని ప్రశ్నించారు. సినిమాలో ఏ హీరోను ఇష్టపడినా..రాజకీయాల దగ్గరొకచ్చే సరికి అందరూ సమిష్టిగా ఆలోచించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో ఓడిపోయినా..నిలబడే ఉండాలని సిద్దపడ్డానని పవన్ చెప్పుకొచ్చారు. దీని ద్వారా రాజకీయంగానే కాకుండా.. సినీ హీరోల ఓట్ బ్యాంక్ ను తన వైపు తిప్పుకొనే పవన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

 pawanvarahi

హీరోల మద్దతు కోరుకుంటున్నారా : పవన్ కల్యాణ్ రాజకీయ నేత కంటే ముందు సినీ హీరో. సహజంగా సినీ హీరలకు తామే గొప్ప అనే భావన ఉంటుంది. ఇప్పుడు రాజకీయ నేతగా మారిన పవన్ ..ఈ విషయంలో ఒక అడుగు తగ్గారు. తన కంటే పెద్ద హీరోలంటూ పేర్లు చెప్పుకొచ్చారు. సినీ హీరోల ప్రభావం తెలుగు రాజకీయాల పైన బలంగా ఉంది. ఇప్పుడు పవన్ కు వెల్లువలా వస్తున్న ఆదరణ అందులో భాగమే.

పార్టీలతో సమానంగా సినీ ప్రముఖ హీరోల అభిమానుల మధ్య పోటీ ఉంది. సోషల్ మీడియాలో ఈ పరిస్థితి పలు సందర్భాల్లో స్పష్టం అయింది. హీరోల అభిమానుల ఓట్ బ్యాంక్ భారీ స్థాయిలో ఉంది. ఇప్పుడు తన అభిమానులో పాటుగా ఇతర హీరోల అభిమానుల మద్దతు పొందితే..తనకు రాజకీయంగా ఎన్నికల వేళ మరింత మేలు జరుగుతుందని పవన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే, సినిమాలో ఉన్న పోటీ తత్వంతో ఈ లెక్కలు ఎంత వరకు ఫలిస్తాయనేది చెప్పలేని పరిస్థితి.

అన్నయ్య ముందుకొస్తారా : పవన్ కల్యాణ్ కోసం ఈ సారి ఎన్నికల్లో మెగా హీరోలు మద్దతుగా ప్రచారానికి వస్తారా రారా అనే చర్చ మొదలైంది. ఈ ఎన్నికలు తన పార్టీకి..తనకు కీలకమని పవన్ పదే పదే చెబుతున్నారు. మరి..అందరు హీరోల గురించి ప్రస్తావిస్తున్న పవన్ తన అన్నయ్య చిరంజీవి ని వారితోనే కలిపి చెప్పటం ఇప్పుడు చర్చకు కారణమవుతోంది. సినీ ఇండస్ట్రీలె..ఫ్యాన్స్ లో చిరంజీవికి ఉన్న ఫాలోయింగ్ ఏంటో అందరికీ తెలిసిందే.

ఎన్నికల వేళ చిరంజీవి మద్దతు తనకు ఉన్నట్లు పవన్ సంకేతాలు అన్నయ్య నుంచి ఇప్పించగలిగితే మద్దతు మరింతగా పెరగటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. గతంలో చిరంజీవి మద్దతు జనసేన కు ఉందని నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. చిరంజీవి ఏపీ రాజకీయాల్లో తనకు ఏ మాత్రం ప్రమేయం లేదని స్పష్టం చేసారు. ఇప్పుడు పవన్ అన్నయ్య మద్దతు కోరుతారా..చిరంజీవి ఓపెన్ గా వచ్చి తమ్ముడుకు అండగా నిలుస్తారా అనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+