ఎక్కడెక్కడ పోటీ చేద్దాం ? నేతలతో పవన్ చర్చలు ! రెండు రోజుల్లో క్లారిటీ..!
ఏపీలో టీడీపీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్.. ముందు సొంత పార్టీలో సీట్ల సమీకరణాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా జనసేన నేతలతో వరుస చర్చలు కొనసాగిస్తున్నారు. ఇందులో జనసేన పోటీ చేసే నియోజకవర్గాలపై చర్చిస్తున్నారు. వీటిపై క్లారిటీ వస్తే అనంతరం టీడీపీతో సీట్ల పంపకాలపై చర్చించవచ్చని ఆయన భావిస్తున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ పార్టీ నేతలతో కీలక చర్చలు జరుపుతున్నారు. ఇందులో రానున్న ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాల ఎంపికపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ తో జరుగుతున్న చర్చల్లో జనసేన పీఏసీ సభ్యులు, పార్టీ కీలక నేతలను పిలిపించారు. వీరి అభిప్రాయాల ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు పవన్ సిద్ధమవుతున్నారు.

జనసేన పార్టీ ఆఫీసులో నేతల బలాబలాలపై పవన్, నాదెండ్ల మనోహర్ ఇవాళ చర్చలు జరుపుతున్నారు. టీడీపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ఇరుపక్షాల కార్యకర్తలు కలిసి పనిచేసేలా తీసుకోవాల్సిన చర్యలపై కూడా నేతలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా జనసేన పోటీ చేసే స్థానాల్లో ఇరుపక్షాల బలాబలాపై కూడా పవన్ ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చర్చలు రేపు, ఎల్లుండి కూడా కొనసాగే అవకాశముంది. ఉభయగోదావరి జిల్లాలు, విశాఖ, కృష్ణా, గుంటూరు, తిరుపతి, అనంతపురం జిల్లాల నేతలతో పవన్ ఇవాళ చర్చిస్తున్నారు.
జనసేన పోటీ చేయాలనుకుంటున్న స్థానాలపై రెండురోజుల్లో నిర్ణయానికి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అనంతరం టీడీపీతో సీట్ల సర్ధుబాటుపై చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇప్పటికే టీడీపీ 25 నుంచి 28 సీట్లను జనసేనకు ఆఫర్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీటిలో ఏయే స్ధానాలు తీసుకోవాలనే అంశంపై పవన్ ఇప్పుడు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే సీఎం పదవి చంద్రబాబుకు అప్పగించడంపై హరిరామజోగయ్య వంటి వారు పవన్ ను నిలదీస్తున్నారు. దీనిపైనా చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications