Pawan kalyan ఎన్నికల వ్యూహం: రంగంలోకి వారాహి; పిఠాపురం నుండే అందుకు ముహూర్తం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో ప్రచార పర్వాన్ని జోరుగా కొనసాగిస్తున్నారు అన్ని ప్రధాన పార్టీల నాయకులు. సంక్షేమ మంత్రంతో అధికార వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దూసుకుపోతుంటే, ప్రజా వ్యతిరేఖ విధానాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ముందుకు వెళ్తున్నారు. ఇక కాంగ్రెస్ కూడా జగన్ పైనే ప్రధానంగా అస్త్రాలు సంధిస్తుంది.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబుతో కలిసి ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటూనే, మరోవైపు వారాహి వాహనాన్ని సిద్ధం చేయాలని పార్టీ నాయకులను ఆదేశించారు. జనసేన నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థుల తరఫున ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకున్న పవన్ కళ్యాణ్ ఈ మేరకు ప్రచారానికి సిద్ధమవుతున్నారు.
టిడిపి అధినేత చంద్రబాబు రేపటి నుంచి టీడీపీ అభ్యర్థుల తరపున ఎన్నికల ప్రచారానికి బయలుదేరుతుంటే, వైసిపి అధినేత జగన్ 27వ తేదీ నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. పవన్ కళ్యాణ్ కూడా మరోమారు జిల్లాల పర్యటనకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ఆయన కూడా మార్చి 27 నుండి పిఠాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు.

దాదాపు 20 రోజులపాటు ప్రచారం పర్వంలో భాగంగా పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాలలో పర్యటించనున్నారు. తొలి విడతలో 10 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ నెలాఖరు నుండి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమవుతున్న పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో విజయమే లక్ష్యంగా జనసేన అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు.
ఒకవైపు జనసేన పార్టీ అభ్యర్థుల కోసం ప్రచారం సాగిస్తూనే, మరోవైపు కూటమి తరపున జరిగే ఎన్నికల ప్రచార సభలలో కూడా పవన్ కళ్యాణ్ పాల్గొనేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పిఠాపురం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.
21 నియోజకవర్గాలను పూర్తిస్థాయిలో కవర్ చేసేలా పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం కొనసాగనుంది. ఏమైనా ఈసారి పవన్ కళ్యాణ్ ఏపీలో జగన్మోహన్ రెడ్డిని దెబ్బ కొట్టడమే, ఓడించటమే లక్ష్యంగా, టిడిపి బిజెపి కూటమితో కలిసి బరిలోకి దిగారు. అమీ తుమీ తేల్చుకునేందుకు రెడీ అయ్యారు.












Click it and Unblock the Notifications