Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Pawan Kalyan: మీ ప్రేమ నన్ను కదిలించింది.. పవన్ కళ్యాణ్ భావోద్వేగం..!

పిఠాపురంలో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచిన ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఆయన వారికి బహిరంగ లేఖ రాశారు. ఇందులో పలు అంశాల్ని పవన్ ప్రస్తావించారు. ముఖ్యంగా పిఠాపురం ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి తనకు మద్దతివ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. అలాగే కూటమిలో ఇతర పార్టీల సహకారాన్ని కూడా ప్రస్తావించారు.

ఈ నెల 13న జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం అభ్యర్ధిగా పోటీ చేసిన తనను ఆదరించి అండగా నిలిచిన ఓటర్ల ప్రేమకు హృదయపూర్వక ధన్యవాదాలు అంటూ పవన్ లేఖను ప్రారంభించారు. పిఠాపురం నుంచి తాను పోటీ చేస్తున్నాను అని ప్రకటించగానే స్వచ్చందంగా తరలివచ్చి మీ కుటుంబ సభ్యుడిగా భావించి పని చేయడం ఎంతో ఆనందం కలిగించిందన్నారు. తాజా ఎన్నికల్లో ఎన్నడూ లేని విధంగా రాత్రి 10 గంటల సమయం వరకూ పోలింగ్ లో పాల్గొని రికార్డ్ స్థాయిలో 86.63 శాతం ఓటింగ్ నమోదు కావడం మీ ప్రేమను తెలియజేస్తుందన్నారు.

pawan kalyan express gratitude over pithapuram voters overwhelming support wrote letter

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జన సైనికులు, టిడిపి, బిజేపి కార్యకర్తలు వ్యవహరించిన తీరు అభినందనీయమని పవన్ తెలిపారు. అలాగే తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని తెలియగానే ఎంతో బలమైన క్యాడర్ ఉన్నప్పటికీ తన సీట్ త్యాగం చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పిఠాపురం టీడీపీ ఇంచార్జ్ ఎస్.వి.ఎస్.ఎన్.వర్మకు కూడా పవన్ ధన్యవాదాలు తెలిపారు.

ఈ ఎన్నికల్లో వర్మ అందించిన సహకారం మరువలేనిదన్నారు. భవిష్యత్తులో కచ్చితంగా ఆయన చట్టసభల్లో అడుగుపెట్టి ప్రజల తరపున బలంగా పని చేస్తారని నమ్ముతున్నానని తెలిపారు. అలాగే రానున్న రోజుల్లో పిఠాపురం నియోజకవర్గ అభివృద్ది కోసం వర్మ అనుభవం వినియోగించుకుంటూ కలిసికట్టుగా ముందుకు వెళ్తామని తెలిపారు. అలాగే నిన్న పుట్టినరోజు వేడుకలు చేసుకున్న వర్మకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు కూడా తెలిపారు. నిండు నూరేళ్ళు ఆయన ఆయురారోగ్యాలతో, ప్రజా జీవితంలో కొనసాగాలని శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి వారి ఆశీస్సులు ఆయనపై ఉండాలని ఆకాంక్షించారు.

అలాగే పిఠాపురంలో తాను పోటీచేస్తున్నాను అని తెలియగానే తమ సినీ కుటుంబ సభ్యుడికి అండగా ఉండేందుకు తమ సినిమాలు, ధారావాహిక లకు గ్యాప్ ఇచ్చి ముందుకు వచ్చి పిఠాపురంలో ప్రతీ గడపకు వెళ్ళి ప్రచారం చేసిన సినీ, బుల్లి తెర నటీ, నటుల ప్రేమ కూడా తనను కదిలించిందని పవన్ తెలిపారు. తన విజయం కాంక్షిస్తూ ఎంతోమంది అగ్ర కథానాయకుల నుంచి, నవతరం నటుల వరకు అందరూ మద్దతు ప్రకటించడం సంతోషాన్నిచ్చిందన్నారు. ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు.

అలాగే దేశ విదేశాల నుండి ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి తరలివచ్చి తమ మాతృభూమి అభివృద్ధి ఆకాంక్షను వెల్లడించిన ఎన్నారై జనసైనికులకు కూడా అభినందనలు తెలిపారు. పిఠాపురంలో మార్పుకు ముందడుగు వేసేందుకు పనిచేసిన ప్రతీ ఒక్క నాయకుడికి, జనసైనికుడికి, వీరమహిళలకు, తెలుగుదేశం, బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, పౌర సమాజానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, రానున్న రోజుల్లో అందరినీ కలుపుకుంటూ పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని పవన్ మాటిచ్చారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+