పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, ఆత్మరక్షణ: చిరంజీవిని చికాకు పెట్టిస్తున్న 'పవర్ స్టార్'!
హైదరాబాద్/విజయవాడ: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగా కుటుంబాన్ని ఆత్మరక్షణలో పడేశారా? అందుకే మెగా కుటుంబ సభ్యులు ప్రతిసారి వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారా? అనే చర్చ సాగుతోంది.
ఇటీవల అల్లు అర్జున్ వ్యవహరించిన తీరు మీడియాలో పతాక శీర్షికలకు ఎక్కింది. 'పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడను బ్రదర్. ఇంక ఏ విషయమైనా అడగండి అని అల్లు అర్జున్' అన్నారు. దీంతో, పవన్ గురించి స్టైలిష్ స్టార్ అలా అనడం ఏమిటనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది.
ఆ తర్వాత దానిపై అల్లు అర్జున్ వివరణ ఇచ్చారు. ఏ మెగా కుటుంబ ఫంక్షన్ అయినా.. కొందరు పవన్ అభిమానులు పవర్ స్టార్ పవర్ స్టార్ అని ఇబ్బంది పెడుతున్నారని, అందుకే తాను అవాయిడ్ చేశానని, ఇప్పటికైనా మారాలని ఆయన సూచించారు.
వేడుకల్లో అభిమానుల నుంచి వచ్చే 'పవన్ కళ్యాణ్, పవర్ స్టార్' మాటలు మెగా కుటుంబాన్ని చికాకు పెట్టిస్తున్నాయని అల్లు అర్జున్ వ్యాఖ్యల ద్వారా కనిపిస్తోందని అంటున్నారు. అభిమానులు పెద్ద ఎత్తున పవర్ స్టార్ అని ఫంక్షన్లలో నినాదాలు చేస్తుండటంతో తప్పనిసరిగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
ఈ కారణంగా అంతకుముందు నాగబాబు, ఇటీవల అల్లు అర్జున్ ఆగ్రహానికి గురయ్యారని అంటున్నారు. గోవిందుడు అందరి వాడేలో చిత్రం వేడుక సమయంలో అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి పదేపదే అడగడటం.. చిరంజీవికి కూడా చికాకు తెప్పించిందనే వాదనలు ఉన్నాయి.

గతంలో ఓసారి అభిమానులు పవన్ కళ్యాణ్ గురించి అడగగా.. గతంలోను ఎన్నోసార్లు ఇది విన్న నాగబాబు ఆగ్రహానికి గురయ్యారు. అతను ఎన్నిసార్లు పిలిచినా రారని మండిపడ్డారు. సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో వేడుక సందర్భంగా చిరు మాట్లాడుతుండగా.. అభిమానులు నినాదాలు చేశారు. చిరు ఆగమంటే ఆగలేదు. కానీ పవన్ ఆగమనగానే ఆగిపోయారు.
ఓ విధంగా చెప్పాలంటే.. తాము ఏం చెబుతున్నామో వినకుండానే అభిమానులు పవన్ కళ్యాణ్, పవర్ స్టార్.. అంటూ నినాదాలు చేయడం వారిని ఆగ్రహానికి గురి చేస్తుందని అంటున్నారు. ఇంకొందరు అయితే, ఇది చిరంజీవి సహా ఇతర మెగా కుటుంబ హీరోలకు ఓ విధంగా అవమానమేనని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ పలుమార్లు.. తనకు చిరంజీవి దేవుడు అని, ఆయన తర్వాతే ఎవరైనా అని వివరణ ఇచ్చారని, అయినా అభిమానులు వినడం లేదని అంటున్నారు. పవన్ అభిమానుల వల్ల చిరంజీవి వల్లే తాము ఈ స్థాయికి ఎదిగామనే మూలాలు ప్రతిసారి చెప్పవలసి వస్తోందని అంటున్నారు.
పవన్ కళ్యాణ్ పైన అభిమానుల అత్యుత్సాహం వల్ల మెగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని, వారిని చికాకు పెడుతోందని అంటున్నారు. దీంతో ఆత్మరక్షణలో పలుమార్లు వాళ్లు స్పందించవలసి వస్తోందని అంటున్నారు.
-
తమిళనాడులో పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం.. విజయ్ కు బిగ్ షాక్..? -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..!












Click it and Unblock the Notifications