పవన్ కల్యాణ్... ఎప్పడు వచ్చామన్నది ముఖ్యం కాదన్నయ్యా?

పవన్ కల్యాణ్ యాత్ర ప్రారంభిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాన్ని అడ్డుకుంటామని, అనుమతివ్వమని వైసీపీ నాయకులు ప్రకటించారు.

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ యాత్రల కోసం ప్రత్యేకంగా వారాహిని రూపొందించారు. కొండగట్టు ఆంజనేయస్వామి, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి దగ్గర పూజలు చేయించడంతోపాటు విజయవాడ కనకదుర్గ అమ్మవారి దగ్గర కూడా పూజలు చేయించి అమ్మవారికి పట్టుచీరను సమర్పించారు. విస్త్రతంగా పర్యటనలు చేయాలనే ఉద్దేశంతో ఈ వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

అడ్డుకుంటామంటున్న వైసీపీ నాయకులు

అడ్డుకుంటామంటున్న వైసీపీ నాయకులు


యాత్ర ప్రారంభిస్తే నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాన్ని అడ్డుకుంటామని, అనుమతివ్వమని వైసీపీ నాయకులు ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఉత్తరాంధ్ర నుంచి ఏడాది ముందే యాత్ర ప్రారంభించారు. ఒకవైపు నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. మరోవైపు వారాహితో యాత్ర చేస్తే రెండువైపుల నుంచి ప్రభుత్వంలో ఉన్న వ్యతిరేకత అంతా బహిరంగవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. లోకేష్ పాదయాత్రకు కవరేజీ రాదన్న ఉద్దేశంతోనే పవన్ తన యాత్రను వాయిదా వేసుకుంటున్నారంటూ వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఎన్నికల కాలం.. డబ్బులు కావాలి

ఎన్నికల కాలం.. డబ్బులు కావాలి

ఎన్నికలకు ఇంకా ఏడాదికి పైగా సమయం ఉంది. అంతేకాకుండా ఒప్పుకున్న సినిమాలను త్వరత్వరగా పూర్తిచేసేందుకు షెడ్యూల్స్ కేటాయించారు. వారాంతపు కార్యక్రమాల్లో కూడా పాల్గొనడం తగ్గించారు. మరోవైపు పార్టీ కార్యక్రమాలన్నీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. ఒప్పుకున్న సినిమాలను పూర్తిచేస్తే వచ్చే పారితోషికాన్ని పార్టీ ఖర్చులకు ఉపయోగించవచ్చని, వచ్చేది ఎన్నికల కాలం కాబట్టి సినిమాలు చేయక తప్పని పరిస్థితి అని జనసేన నాయకులు చెబుతున్నారు.

చివరి 6 నెలలు సరిపోతాయిలే

చివరి 6 నెలలు సరిపోతాయిలే

ఎన్నికలకు చివరి ఆరునెలల సమయంలో ఉధృతంగా ప్రచారం నిర్వహిస్తే సరిపోతుందనే భావనలో పవన్ ఉన్నారని, ఇప్పటినుంచే యాత్రలు చేయడంవల్ల ఉపయోగముండదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీని నడపడానికి డబ్బులు కూడా కావాలని కాబట్టి వాటిని సమకూర్చుకోవడానికి సినిమాలు చేయక తప్పని పరిస్థితి ఉంది. గతంలో శని, ఆదివారాలు వచ్చినప్పుడు పార్టీ తరఫున రాజకీయ కార్యక్రమాలు చేపట్టేవారు. కానీ ఇప్పుడు వాటిని కూడా నిర్వహించడంలేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలనే ఉద్దేశంతో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ, ప్రణాళికలు రచించుకుంటూ వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించాలన్నదే పవన్ ధ్యేయంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+