Pawan Kalyan: కేబినెట్ భేటీలో న్యూ లుక్ తో పవన్-హరిహర పీరమల్లు ఎఫెక్ట్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన లుక్ పూర్తిగా మార్చేశారు. గత ఎన్నికలకు ముందు నుంచీ గుబురు గడ్డంతో దర్శనమిచ్చిన పవన్ కళ్యాణ్ చాలా రోజుల తర్వాత తన లుక్ మార్చారు. పూర్తిగా గడ్డం తీసేసి గుబురు మీసంతో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్ ఇవాళ కేబినెట్ భేటీకి వచ్చారు.దీంతో ఆయన కేబినెట్ సహచరులు కూడా ఆయన్ను ప్రత్యేకంగా చూస్తున్నారు. తన తాజా చిత్రం హరిహర వీరమల్లు షూటింగ్ కారణంగా పవన్ ఈ లుక్ లోకి మారినట్లు తెలుస్తోంది.
గత అసెంబ్లీ ఎన్నికలకు చాలా ముందే పవన్ కళ్యాణ్ షూటింగ్స్ పూర్తి చేశారు. అయినా మరికొన్ని చిత్రాల షూటింగ్స్ ఎన్నికల కారణంగా పెండింగ్ లో ఉండిపోయాయి. అప్పటి నుంచి ఎలాగో షూటింగ్స్ లేకపోవడంతో పవన్ కళ్యాణ్ గుబురు గడ్డంతో కనిపించడం ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలోనూ అలాగే కనిపించారు. ఎన్నికలు ముగిసి ప్రభుత్వ ఏర్పాటు చేసాక కూడా డిప్యూటీ సీఎం అయినా పవన్ మాత్రం గడ్డం తీయలేదు.

కానీ ఇప్పుడు ఎన్నికల హడావిడి, ప్రచారాల హడావిడి ముగిసిపోవడం, తిరిగి పెండింగ్ చిత్రాల షూటింగ్స్ పూర్తి చేయాలని భావిస్తుండటంతో పవన్ కళ్యాణ్ నిన్న కొత్త లుక్ లోకి మారిపోయారు. తాజాగా హరిహరవీరమల్లు చిత్రం షూటింగ్ లో తీసుకున్న ఓ ఫొటోను సోషల్ మీడియాలో పవన్ షేర్ చేశారు.

ఇవాళ కేబినెట్ భేటీలోనూ అదే లుక్ తో పవన్ కనిపించారు. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ముగియనుంది. ఆ తర్వాత కూడా వరుసగా షూటింగ్స్ ఉండటంతో పవన్ ఇదే లుక్ కొనసాగించే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications