Pawan kalyan రాజకీయాల్లోకి రావటం దర్శకుడు త్రివిక్రమ్ కు ఇష్టం లేదట... కానీ!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో కీలక భూమిక పోషించాలని గత పదేళ్లుగా ప్రయత్నం చేస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచన ఇష్టం లేనివారు చాలామంది ఉన్నారు అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ అనేక సందర్భాలలో చెబుతూ వచ్చారు. మొదట్లో తన కుటుంబ సభ్యులకే రాజకీయాలు ఇష్టం లేదని చెప్పిన పవన్ కళ్యాణ్, తాజాగా నిన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రావడం తన మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఇష్టం లేదని ఆయన పేర్కొన్నారు. ఒకానొక సమయంలో పార్టీని నడపడానికి తాను ఇబ్బంది పడుతున్నప్పుడు, డబ్బులు ఎక్కడ నుంచి తీసుకురావాలో అర్థం కాక సతమతమవుతున్న సమయంలో తన మిత్రుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ అండగా నిలిచాడని గుర్తు చేశారు. కష్టకాలంలో వెన్నంటి ఉన్న స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలని పేర్కొన్నారు.

Pawan Kalyan interesting comments on Director Trivikram srinivas over his political entry

నేను సమాజం కోసం ఆలోచిస్తే నా కోసం ఆలోచించే వారు ఒకరు ఉండాలి కదా అంటూ పేర్కొన్న పవన్ కళ్యాణ్ తన కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎప్పుడు ఆలోచిస్తాడు అంటూ చెప్పుకొచ్చారు. తన కోసమే వకీల్ సాబ్ తో పాటుగా మరో మూడు నాలుగు సినిమాలు చేసినట్టు పవన్ కళ్యాణ్ తెలిపారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ కు తను రాజకీయాల్లోకి రావడం ఏమాత్రం ఇష్టం లేదన్నారు.

టీనేజ్లో ఉన్న సమయంలోనే నేను ఉద్యమంలోకి వెళ్ళిపోవాలనుకున్నాను కానీ కుదరలేదని పేర్కొన్నారు. సమాజం పట్ల తనకు ఎంతో కోపం ఉండేదని, నా మనసులోని బాధ చూసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ నా బాధను సినిమాలో మాటలుగా రాస్తే రాజకీయాల్లోకి వెళ్లనని భావించి జల్సా లో ఇంటర్వెల్ సీన్ రాసారని ఆసక్తికర విషయాలు చెప్పారు పవన్ కళ్యాణ్.

చివరకు తాను రాజకీయాల్లోకి రాకుండా తన వంతుగా శతవిధాల ప్రయత్నం చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా చేతులెత్తేసారు అని మీ ఇష్టం వచ్చింది చేయండి అని చెప్పారని పవన్ కళ్యాణ్ తెలిపారు. ఇక ఇదే సమయంలో గత ఎన్నికల్లో ఓటమిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన పవన్ కళ్యాణ్ తాను బహిరంగ సభలు పెడితే జనం వస్తారని, లక్షలాది మంది ఓటర్లు కాదని తనకు తెలుసని పేర్కొన్నారు.

2019 ఎన్నికలలో ఓడిపోతానని తెలిసికూడా యుద్ధం చేశానన్న పవన్ కళ్యాణ్, యుద్ధం చేసినప్పుడు జయాపజయాలతో సంబంధం లేదన్నారు. ఏపీలో రాజకీయాలను తట్టుకొని, సినిమాలన్నీ వదులుకొని, డబ్బులు లేక, ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతూ కూడా దేశం మీద ఇంత పిచ్చి మంచిదా అని చాలా సందర్భాలలో అనుకున్నానని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా , తాను అనుకున్న బాటలోనే ముందుకు నడుస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+