Pawan Kalyan: ఆస్పత్రిలో పవన్ కళ్యాణ్!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. శనివారం హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్ పలు వైద్య పరీక్షలు చేయించుకున్నారు. స్కానింగ్, తత్సంబంధిత పరీక్షలు నిర్వహించారు. రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు పలు సూచనలు చేశారు.

మరికొన్ని వైద్య పరీక్షలు అవసరం ఉంది. ఈ నెలాఖరునగానీ, మార్చి మొదటి వారంలోగానీ మిగిలిన వైద్య పరీక్షలు చేయించుకొంటారు. 24వ తేదీ నుంచి మొదలయ్యే బడ్జెట్ సమావేశాలకు పవన్ కల్యాణ్ హాజరవుతారు. అని జనసేన పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో వెల్లడించింది.

Pawan Kalyan is admitted to Apollo Hospital in Hyderabad

కాగా, పవన్ కళ్యాణ్ గత కొంత కాలంగా సయాటికాతో బాధపడుతున్నారు. అందుకే ఆయన ఇటీవల సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని దర్శిస్తే ఆరోగ్యం నయమవుతుందని భావించి.. కేరళ, తమిళనాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయాలను సందర్శించారు. అంతేగాక, ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళాకు వెళ్లి త్రివేణి సంగమంలో పవన్ కళ్యాణ్ దంపతులు పుణ్యస్నానాలు ఆచరించారు. కుమారుడు అకీరా కూడా వారితో ఉన్నాడు.

అయితే, సుదీర్ఘ ప్రయాణం అనంతరం పవన్ కళ్యాణ్ తాజాగా ఆస్పత్రిలో చేరడంతో జనసేన పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు కొంత ఆందోళన చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎలాంటి అనారోగ్యం నుంచైనా త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బాగుంటేనే తాము బాగుంటామని కొందరు అభిమానులు నెట్టింట్లో పోస్టులు పెట్టడం గమనార్హం. అయితే, చిన్నపాటి వైద్య పరీక్షల కోసమే వపన్ ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. 24 నుంచి ప్రారంభం కానున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా పవన్ కళ్యాణ్ హాజరవుతారని జనసేన వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో పవన్ ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+