హనుమాన్ జయంతి నాడు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ జోరు; జనసేన ట్రెండింగ్ వీడియో!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. ఇప్పటికే మూడు వంతులకు పైగా అభ్యర్థులు తమ నామినేషన్లను దాఖలు చేసి, ఎన్నికల కురుక్షేత్రంలో హోరాహోరీగా తలపడుతున్నారు. నామినేషన్ల గడువు పూర్తి కావడానికి మరో రెండు రోజులే ఉండడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు చాలా వరకు నామినేషన్లను దాఖలు చేశారు.

పవన్ కళ్యాణ్ హనుమాన్ జయంతి సెంటిమెంట్
ఇప్పటికే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయగా, తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం వెనుక ఆయనకు బలమైన సెంటిమెంట్ ఉందని ఆయన అభిమానుల్లో చర్చ జరుగుతుంది.

Pawan Kalyan Josh in Pithapuram on Hanuman Jayanthi Janasena trending video

హనుమాన్ జయంతి రోజున అంజనీ పుత్రుడు నామినేషన్
హనుమాన్ వీర భక్తుడైన పవన్ కళ్యాణ్ హనుమాన్ జయంతి రోజునే తన నామినేషన్ ను దాఖలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. హనుమాన్ జయంతి రోజున అంజనీ పుత్రుడు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేయడం ఇప్పుడు అందరిలోనూ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. హనుమాన్ శక్తి శాలి, హనుమంతుని నమ్ముకున్న వారికి తిరిగే లేదన్నది హనుమాన్ భక్తుల విశ్వాసం.

హనుమంతుని కటాక్షం పవన్ పైన
అటువంటి హనుమాన్ పుట్టిన రోజున, హిందువులు అత్యంత ఇష్టంగా జరుపుకునే హనుమాన్ జయంతి నాడు పవన్ కళ్యాణ్ నామినేషన్ దాఖలు చేస్తుండడంతో ఆ హనుమంతుని కటాక్షం పవన్ కళ్యాణ్ పై ఉంటుందని చాలామంది విశ్వసిస్తున్నారు. ఆ వీడియోలో హనుమాన్ తో పాటు, భుజం పైన గదను ధరించి హనుమాన్ లాగా పవన్ కళ్యాణ్ రాష్ట్రం కోసం వస్తున్నారని చెప్పే ప్రయత్నం చేశారు జనసేన పార్టీ నేతలు.

ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే విజయోత్సవ ర్యాలీ
మొత్తంగా చూస్తే హనుమాన్ జయంతి రోజున పిఠాపురంలో ఆయన భారీ ర్యాలీ జనసేన జోష్ కు సంకేతంగా నిలుస్తుంది. పవన్ కళ్యాణ్ వేస్తున్న నామినేషన్ ఆయనకు ఎన్నికల్లో విజయాన్ని ఇస్తుందని పవన్ అభిమానులు బలంగా నమ్ముతున్నారు. ఈరోజు పిఠాపురంలో జరగబోయేది పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ కాదు, ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టించే విజయోత్సవ ర్యాలీ అంటున్నారు జనసైనికులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+