మూడవ విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదుకు ముహూర్తం ఫిక్స్: పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే!!
జనసేన పార్టీ వచ్చే ఎన్నికలను లక్ష్యంగా చేసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దూకుడును కొనసాగిస్తుంది. వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీని ఓడించటమే లక్ష్యంగా జనసేన అధినేత పావులు కదుపుతున్నారు. ఇప్పటికే జనసేన నాయకులు ప్రజా క్షేత్రంలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ జనవాణి - జనసేన భరోసా పేరుతో కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఇక పార్టీని బలోపేతం చెయ్యటం పైన కూడా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు.

మూడో విడత సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపడుతున్న జనసేన
ఇందులో భాగంగా పార్టీని పటిష్టం చేసుకోవడం కోసం మూడో విడత సభ్యత్వాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టడానికి రంగం సిద్ధం చేసింది. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఫిబ్రవరి 10వ తేదీ నుండి ఫిబ్రవరి 28వ తేదీ వరకు నిర్వహించడానికి జనసేన సమాయత్తమవుతుంది. భారీగా సభ్యత్వాలను నమోదు చేసి వచ్చే ఎన్నికలలో ముందుకు వెళ్లడానికి జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నారు.
పార్టీ కార్యకర్తలే బలమన్న జనసేనాని
ఇక జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మూడో విడత జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రతి ఒక్కరు విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. నేడు మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి కార్యకర్తలే బలమని పేర్కొన్నారు. కార్యకర్తలు పార్టీ సంపద అని చెప్పుకొచ్చారు. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మూడవ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం కొనసాగుతుందన్నారు. గత రెండు విడతల్లో ఎంతో కష్టపడిన వాలంటీర్లను అభినందించిన పవన్ కళ్యాణ్, మొత్తం గత రెండు విడతల్లో 6400 మంది వాలంటీర్లు ఎంతగానో కష్టపడ్డారని ఆయన కొనియాడారు.

తన వంతు విరాళం ఇస్తానన్న పవన్ కళ్యాణ్ .. పార్టీ శ్రేణులకు పిలుపు
జనసేన పార్టీకి సంబంధించి పార్టీ క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి, ప్రమాద బీమా నమోదుకు తన వంతుగా రెండు విడతల్లోనూ రెండు కోట్ల రూపాయలు విరాళం ఇచ్చానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మూడవ విడతలోనూ తనవంతుగా విరాళం అందిస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. మూడో విడత సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని అందరూ సమిష్టిగా ముందుకు తీసుకువెళ్లాలని, విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేశారు.
-
బెంగళూరు, మైసూర్ కు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
జీవన్ రెడ్డికి కేసీఆర్ బిగ్ టాస్క్, ఆపరేషన్ బిగిన్..!! -
భానుడి భగభగలు, పిడుగులతో భారీ వర్షాలు - ఈ ప్రాంతాలకు తాజా హెచ్చరికలు..!! -
Vaibhav Sooryavanshi: బుడ్డోడు మరో వరల్జ్ రికార్డు-కేవలం రెండో బ్యాటర్..! -
'డెకాయిట్'లో అసలైన ట్విస్ట్ ఇదే! -
PM-Rahat: యాక్సిడెంట్ బాధితులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్-ఆస్పత్రులకు ఆదేశాలు..! -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
Video: ఇదెక్కడి మాస్ రా మావా. బటన్ నొక్కితే బండి నంబర్ ప్లేట్ ఛేంజ్ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
రేపే రాజ పంచక కాలం ప్రారంభం -
వైభవ్ సూర్యవంశీ RCB పై ఆడిన సునామీ ఇన్నింగ్ దెబ్బకు.. !! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!!











Click it and Unblock the Notifications