పిఠాపురంలో రూ.1,500 కోట్లతో అభివృద్ధి పండుగ! పవన్ కళ్యాణ్ అభయహస్తం..

పిఠాపురం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రూ.1,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. సభా వేదికపై నుంచి ఈ నియోజకవర్గానికి చెందిన మరికొన్ని కీలక అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రకటించారు. పిఠాపురం పట్టణ అభివృద్ధి కోసం సుమారు రూ.200 కోట్లతో అండర్‌ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి పథకాలు, రోడ్ల విస్తరణ, అత్యాధునిక బస్టాండ్, ఫిష్ మార్కెట్, రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టనున్నట్లు వివరించారు.

తనను గెలిపించి రాష్ట్రాభివృద్ధికి పునాది వేశారని, తన విజయానికి సహకరించిన జనసేనతో పాటు టీడీపీ, బీజేపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. ఎప్పుడూ గెలుపోటముల గురించి ఆలోచించలేదని, ఉప్పాడ తీర ప్రాంత సమస్య పరిష్కారానికి శాశ్వత రక్షణ గోడ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు సాధించామని, పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు.

Pawan Kalyan Launches Rs 1 500 Crore Projects in Pithapuram Key Infrastructure and Welfare Updates

కార్యక్రమంలో భాగంగా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాళ్లను పవన్ కళ్యాణ్ సందర్శించారు. కాకినాడ జిల్లాలో గుర్రపుడెక్కతో తయారు చేసిన అలంకరణ వస్తువులను పరిశీలించి, వాటి తయారీ విధానం, స్థానిక ఉపాధి అవకాశాల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గత విద్యాసంవత్సరం పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను పలకరించి, సభాప్రాంగణంలో 32 మందికి ల్యాప్‌టాప్‌లను అందజేశారు. విద్యార్థులు చదువులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

జనసేన వాటాపై తేల్చేసిన పవన్ ..! మళ్లీ 100% స్ట్రైక్ రేట్ వెనుక ?
జనసేన వాటాపై తేల్చేసిన పవన్ ..! మళ్లీ 100% స్ట్రైక్ రేట్ వెనుక ?

మత్స్యకారుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పవన్ కళ్యాణ్ ఉప్పాడ-కొత్తపల్లి మండలానికి చెందిన 1,258 మంది మత్స్యకారులకు లైఫ్ జాకెట్లు, సీ సేఫ్టీ కిట్లను పంపిణీ చేశారు. లైవ్ ఫిష్, డ్రై ఫిష్ రవాణాకు ఉపయోగించే ప్రత్యేక వాహనాలను స్వయంగా పరిశీలించారు. వేదికపై నుంచి 76 మంది మత్స్యకారులకు డ్రై ఫిష్ యూనిట్లు, 30 మందికి కైనెటిక్ హోండా ద్విచక్రవాహనాలు, ముగ్గురికి ఆటోలను మంజూరు చేశారు.

మహిళా సంఘాలకు రూ.120 కోట్ల రుణాలు

మహిళల ఆర్థిక స్వావలంబనే ధ్యేయంగా నియోజకవర్గంలోని స్వయం సహాయక సంఘాలకు రూ.120 కోట్ల రుణాల మంజూరుకు సంబంధించిన చెక్కులను పవన్ కళ్యాణ్ అందజేశారు. వీటితో పాటు పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని 10 మంది లబ్ధిదారులకు నివాస గృహాల క్రమబద్ధీకరణ పట్టాలను అందజేశారు.

మనోహర్ వ్యాఖ్యలతో కేడర్ ఆగ్రహం వేళ పవన్ అనూహ్య నిర్ణయం..!!
మనోహర్ వ్యాఖ్యలతో కేడర్ ఆగ్రహం వేళ పవన్ అనూహ్య నిర్ణయం..!!

అంధ విద్యార్థిని ఆశ తీర్చిన డిప్యూటీ సీఎం

పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా స్వాతి అనే అంధ విద్యార్థిని ఆయనను కలిసి పాట పాడాలనే తన కోరికను వ్యక్తపరిచింది. విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే ఆ విద్యార్థినిని వేదిక వద్దకు పిలిపించి ఆప్యాయంగా పలకరించారు. వేదికపై స్వాతి ఆలపించిన వేమన శతక పద్యాలను ఆసక్తిగా విని, ఆమె ప్రతిభను ప్రత్యేకంగా అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+