వైసీపీ షాకయ్యే పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ.. ఈసీకి ఫిర్యాదు.. ఎందుకంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల హడావిడి కొనసాగుతున్న క్రమంలో నామినేషన్ల పర్వం జోరందుకుంది. నామినేషన్లకు ఇంకా రెండు రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేయడం పైన ఫోకస్ పెట్టారు. ఇక నామినేషన్ దాఖలు సందర్భంలోనే భారీ ర్యాలీలను నిర్వహించి తమ సత్తా చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో నామినేషన్ దాఖలు చేశారు.
కార్లు, బైకులతో పవన్ కళ్యాణ్ భారీ ర్యాలీ
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అదిరిపోయే రేంజ్ లో పిఠాపురం నుంచి మంగళవారం నామినేషన్ వేశారు. జనసేన, టిడిపి, బిజెపి నేతలు పెద్ద సంఖ్యలో పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు. కార్లు, బైకులతో నిర్వహించిన భారీ ర్యాలీ జన సైనికులలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. లక్ష ఓట్ల మెజారిటీ లోడింగ్ అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ వీడియోలతో హల్చల్ చేస్తున్నారు.

వైసీపీని భయపెట్టేలా సాగిన ర్యాలీ
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కు భారీ మద్దతు ఉందని తలపించే రీతిలో నామినేషన్ ర్యాలీ జరిగింది. ఒక్కమాటలో చెప్పాలంటే వైసిపిని భయపెట్టేలా సాగిన పవన్ కళ్యాణ్ నామినేషన్ ర్యాలీ ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నామినేషన్ వేయడానికి నిర్వహించిన ర్యాలీలో జాతీయ జెండాలను వినియోగించడం పైన ప్రస్తుతం ఈసీకి ఫిర్యాదు చేశారు.
Aerial view :
— JanaSena Party (@JanaSenaParty) April 23, 2024
విజయోత్సవ ర్యాలీని తలపించిన నామినేషన్ ర్యాలీ!#PawanKalyanWinningPithapuram #VoteForGlass #Pithapuram pic.twitter.com/nInPsTMrok
ఈసీకి పవన్ కళ్యాణ్ పై ఫిర్యాదు
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై జర్నలిస్టు నాగార్జున రెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పిఠాపురం లో జరిగిన నామినేషన్ ర్యాలీలో పవన్ కళ్యాణ్ జాతీయ జెండాను వినియోగించారని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. జాతీయ పతాకాన్ని ఉపయోగించడం పైన ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోండని కంప్లైంట్
జాతీయ జెండా ని ఎప్పుడు పడితే అప్పుడు, ఎలా పడితే అలా వినియోగించడానికి వీలులేదని, దానికంటూ ఒక విలువ, గౌరవం ఉన్నాయని నాగార్జున రెడ్డి పేర్కొన్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకోవాలని ఆయన ఈసీకి ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదు వెనుక వైసీపీ ఉందని జనసైనికులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications