ప్రధాని మోదీ మరో పేరును బయటపెట్టిన పవన్ .. ఏంటో తెలుసా?
అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. తిరువనంతపురం నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకున్న ఆయనకు.. ఏపీ అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ స్వాగతం పలికారు. అక్కడ నుంచి ప్రధాని మోదీ హెలీకాప్టర్ లో వెలగపూడిలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సమావేశంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ప్రధాని మోదీ మరో పేరును రిలీల్ చేశారు. అవును ప్రధాని మోదీ గతంలో ఓ సన్యాసాశ్రమంలో ఉన్నప్పుడు ఆయనకు 'అనికేత్' అని పేరు పెట్టారు. అనికేత్ అని పిలిచేవారు.. దానర్థం పరమ శివుడు, ఇల్లు లేనివాడు అని పవన్ కల్యాణ్ తెలిపారు. మన ప్రధాని మోదీ కుటుంబం లేనివాడని.. అయితే.. 140 కోట్ల మంది ప్రజానికాన్ని తన కుటుంబ సభ్యులుగా భావించి ముందుకు సాగుతున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

ఇక ప్రధాని సమక్షం లో డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. గత అయిదేళ్ల కాలంలో వైసీపీ హయాంలో రైతుల కష్టాలను ప్రస్తావించారు. పహల్గాంలో ఉగ్రదాడి పైన ఆవేదన వ్యక్తం చేసారు. ఇలాంటి సున్నిత సమయంలో ప్రధాని అమరావతి రావటం పైన ధన్యవాదాలు చెప్పారు.
అయితే పవన్ కల్యాణ్ స్పీచ్ కు ముగ్ధుడైన ప్రధాని మోదీ.. సీఎం చంద్రబాబు ఎదుటే పవన్ ను మెచ్చుకున్నారు. అంతేకాక దగ్గరికి పిలిచి మరీ చాక్లెట్ ఇచ్చారు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications