ఏపీ పరిణామాలపై టాలీవుడ్ మౌనం అందుకే- పవన్ కళ్యాణ్ కామెంట్స్..
ఏపీలో స్కిల్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అలాగే చంద్రబాబు అరెస్టుకు మద్దతుగా, వ్యతిరేకంగా రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన నుంచి లబ్ది పొందిన తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దలు ఇప్పుడు ఆయనకు మద్దతుగా మాట్లాడకుండా ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారనే చర్చ జరుగుతోంది. దీని వెనుక కారణాన్ని జనసేన అధినేత, హీరో పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

హైదరాబాద్ లో ఓ వినోద ఛానల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ కు ఏపీలో తాజా పరిణామాలపై టాలీవుడ్ మౌనం ఎందుకన్న ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన తనదైన శైలిలో దీనికి గల కారణాన్ని వెల్లడించారు. ముఖ్యంగా ఏపీలో రాజకీయాలు ఇతర రాష్ట్రాల్లో సైతం చర్చనీయాంశం అవుతున్నా టాలీవుడ్ పెద్దలు దీనిపై స్పందించకుండా ఎందుకు మౌనంగా ఉండిపోతున్నారో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేశారు.
టాలీవుడ్ పరిశ్రమకు చెందిన వారంతా కళాకారులే తప్ప రాజకీయ నాయకులు కాదంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. రజనీకాంత్ వంటి వారు కూడా రాజకీయ పరిణామాలపై మాట్లాడలేరంటని పవన్ వెల్లడించారు. ఒక వేళ మాట్లాడినా చాలా ఇబ్బందికరమైన పరిస్ధితులు ఎదురవుతాయంటూ పవన్ వ్యాఖ్యానించారు. వాస్తవానికి ప్రపంచంలో చోటు చేసుకునే ప్రతీ ఘటనకూ చిత్ర పరిశ్రమ స్పందించాలని అంతా కోరుకుంటారని, కానీ అదంత తేలికైన విషయం కాదన్నారు.
తద్వారా ఏపీ రాజకీయాలపై ఏం మాట్లాడితే ఏం జరుగుతుందో అన్న టాలీవుడ్ లో ఉందన్న అంశాన్ని పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పేశారు. అంతే కాదు రాజకీయాలపై పరిశ్రమ మాట్లాడకపోవడాన్ని కూడా ఆయన సమర్ధించినట్లయింది. గతంలోనూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు అరెస్టు తర్వాత టాలీవుడ్ మౌనంగా ఉండటంపై ఇవే తరహా వ్యాఖ్యలు చేశారు.
-
ఇదేం టీజర్ రా బాబోయ్.. మహేష్ అన్నకొడుకు ఏడిపించాడు భయ్యా.. మరో ఆర్ఎక్స్ 100..! -
పగలు మనిషి.. రాత్రి అయితే.. 'రాకా' లో అల్లు అర్జున్ క్యారెక్టర్ తెలిస్తే గూస్ బంప్స్..! -
పవర్ స్టార్ "OG" సీక్వెల్ షూటింగ్ షురూ.. టైటిల్ ఇదే ?? -
ఎన్టీఆర్ మూవీలో రామ్ చరణ్ హీరోయిన్.. నీల్ ప్లాన్ గట్టిగానే !! -
పెళ్లిపై హీరో రామ్ కీలక ప్రకటన..!! -
మౌళి "దొంగనా కొడుకు".. మైత్రీ మూవీస్ సంచలన ప్రకటన..!! -
ప్రభాస్ రోజూ తినే ఫుడ్ ఖర్చు ఎంతో తెలుసా ? అన్నీ వెరైటీలా ?? -
ఆర్భాటంగా పెళ్లి ప్రకటన చేసిన స్టార్ హీరోయిన్.. తీరా చూస్తే షాకింగ్ ట్విస్ట్! -
ఆ స్టార్ హీరో నా క్లాస్ మెట్.. అన్నం పెట్టిన రోజుల్ని మర్చిపోలేను -
అందరి ముందే నడుం గిల్లాడంటూ ఏడ్చేసిన తెలుగు బ్యూటీ.. -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!!












Click it and Unblock the Notifications