గోదావరి జిల్లాల్లో పవన్ గ్రాఫ్ పెరుగుతోందా ? సీఎం సీటు డిమాండ్ వెనుక ? బహుళ ప్రయోజనాలు !
ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్న జనసేనాని పవన్ కళ్యాణ్ తాజాగా పొత్తులపై చురుగ్గా స్పందిస్తున్నారు. అదే సమయంలో ఆయన పార్టీ జనసేన తనకు సీఎం పదవి ఇవ్వాలని మిత్రపక్షం బీజేపీతో పాటు ఇతర పార్టీల ముందు డిమాండ్ పెడుతోంది. దీని వెనుక ఆసక్తికర కారణాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో రాజకీయాలు ఎలా మారినా పవన్ కళ్యాణ్ కు ప్రయోజనం ఉండేలా దీని వెనుక స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది.

గోదావరి జిలాల్లో పవన్ గ్రాఫ్ పెరిగిందా ?
2019 ఎన్నికల తర్వాత మారిన పరిస్ధితుల్లో గోదావరి జిల్లాల్లో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. స్ధానిక ఎన్నికల్లో సైతం టీడీపీ-జనసేన కలిసి కాపు బెల్ట్ లో కొన్ని కీలక స్ధానాలు కైవసం చేసుకున్నాయి. తాజాగా కోనసీమ హింస వెనుక కూడా వైసీపీ ఉందన్న ప్రచారంతో గోదావరి జిల్లాల్లో బలంగా ఉన్న కాపు సామాజిక వర్గం పవన్ వైపు మొగ్గు చూపుతోంది. టీడీపీకి అండగా ఉన్న కమ్మ సామాజిక వర్గం కూడా భవిష్యత్తులో పవన్ తమతో కలిసి వస్తాడన్న ఉద్దేశంతో పవన్ కు మద్దతిస్తోంది. దీంతో గోదావరి జిల్లాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కు పరిణామాలు సానుకూలంగా మారుతున్నాయి.

పవన్ కళ్యాణ్ సీఎం సీటు డిమాండ్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వచ్చే ఎన్నికల్లో సీఎం సీటు ఇవ్వాలంటూ ఆ పార్టీకి చెందిన నేతలు ఈ మధ్య తరచుగా డిమాండ్ చేస్తున్నారు. జనసేనకు మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో పాటు తమకు కలిసివచ్చే ఇతర పార్టీలకు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. దీంతో పవన్ కళ్యాణ్ ను సీఎం చేసే పార్టీలు ఏవి ఉన్నాయన్న చర్చ రాష్ట్రంలో మొదలైంది. ఇప్పటికే ప్రధాన విపక్షం టీడీపీకి చంద్రబాబు ఎప్పటికీ సీఎం అభ్యర్దిగా ఉంటారు. జనసేన మిత్రపక్షం బీజేపీ తరఫున సీఎం అభ్యర్ధి ఇంకా ఖరారు కాలేదు. గతంలో పవన్ ను సీఎం చేస్తామంటూ ఓసారి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు చెప్పినా, మారిన పరిస్ధితుల్లో బీజేపీ ఆ డిమాండ్ కు తలొగ్గేలా కనిపించడం లేదు.

జనసేన డిమాండ్ వెనుక కారణాలివే ?
పవన్ కళ్యాణ్ కు సీఎం సీటు ఇవ్వాలంటూ మిగతా పార్టీల ముందు జనసేన పెడుతున్న ప్రతిపాదనల వెనుక పలు కారణాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే గోదావరి జిల్లాల్లో పవన్ గ్రాఫ్ పెరిగింది. అదే సమయంలో టీడీపీ కూడా జనసేనతో పొత్తుకు సిద్ధంగా ఉంది. బీజేపీ కలిసి వచ్చినా రాకపోయినా ఇప్పుడు పవన్ కు వచ్చే ఇబ్బందులేవీ లేవు. అదే సమయంలో సీఎం సీటు డిమాండ్ ను టీడీపీ ముందు పెట్టడం ద్వారా భవిష్యత్తులో కుదిరితే సీఎం సీటు కుదరకపోతే షేరింగ్ లో సగం సగం అవకాశం వచ్చినా మంచిదే. అదే సమయంలో బీజేపీపై సీఎం సీటు డిమాండ్ ఉంచడం ద్వారా ఆ పార్టీ అంగీకరిస్తే మంచిది లేకుండా గుడ్ బై చెప్పేందుకు అదే కారణంగా మారుతుంది. ఇలా రకరకాల కారణాలతో జనసేన పార్టీ పవన్ కు సీఎం సీటు ఇవ్వాల్సిందేనన్న డిమాండ్ ఇప్పుడు తెరపైకి తెచ్చినట్లు కనిపిస్తోంది.
-
పవన్ Vs విజయ్, మమత- చంద్రబాబు : ఆ రెండు రాష్ట్రాల్లో మోదీ బిగ్ టాస్క్..!? -
ఇంటింటికీ గంగమ్మ: డ్వాక్రా మహిళలకు కీలక బాధ్యతలు -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
కేంద్రానికి కవిత షాకింగ్ అల్టిమేటం.. ఆ విషయంలో పోరాటమే! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!!












Click it and Unblock the Notifications