Pawan Kalyan : వైఎస్ జగన్ తో "పాపం పసివాడు" సినిమా- పవన్ కళ్యాణ్ ట్వీట్

ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ ప్రధాన రాజకీయ పార్టీల మధ్య వార్ ముదురుతోంది. సమయం దొరికినప్పుడల్లా ప్రత్యర్ధులపై వ్యంగాస్త్రాలు విసురుతూ నేతలు ప్రతాపం చూపుతున్నారు. ఇదే క్రమంలో నిజాంపట్నంలో నిన్న వైఎస్సార్ మత్సకారల భరోసా నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సీఎం జగన్ .. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. దీనికి ఇవాళ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు.

పవన్ కళ్యాణ్ రెండు సినిమాల మధ్య విరామంలో వచ్చి రాజకీయ సభలు పెట్టి వెళ్లిపోతాడని, ఆ సమయంలోనూ బాబుకే కాల్షీట్లు ఇస్తాడని, బాబు స్క్రిప్ట్ ప్రకారమే అన్ని పనులు చేస్తాడని నిన్న నిజాంపట్నంలో జగన్ వ్యాఖ్యానించారు. దీనిపై స్పందించిన పవన్ కళ్యాణ్ వైఎస్ జగన్ ను ఉద్దేశించి ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఆయన మన ఏపీ సీఎంతో ఎవరైనా ఈ సినిమా తీస్తారని ఆశిస్తున్నానంటూ ఓ పాత సినిమా పోస్టర్ పెట్టారు.

pawan kalyan satire tweet on ys jagans comments in nizampatnam meeting

అతను చాలా అమాయకుడు & అమాయకుడు. ఇక్కడ ఒక చిన్న మార్పు మాత్రమే అవసరం: అతని చేతిలో 'సూట్‌కేస్'కి బదులుగా, అతని అక్రమ సంపద కోసం మనీలాండరింగ్‌ను సులభతరం చేసే బహుళ 'సూట్‌కేస్ కంపెనీలను' ఉంచండి అని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ప్రియమైన AP CM, మీరు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లేదా కామ్రేడ్ తరిమెల నాగి రెడ్డి కాదు. మీ అక్రమ సంపాదనతో, ప్రజలపై మీరు సాగిస్తున్న హింసతో 'వర్గయుద్ధం' అనే పదాన్ని ఉచ్చరించే హక్కు కూడా మీకు లేదు.

ఏదో ఒక రోజు 'రాయలసీమ' మీ నుంచి, మీ గుంపు బారి నుంచి విముక్తమవుతుందని ఆశిస్తున్నాను. దయచేసి.... అంటూ పవన్ వ్యాఖ్యానించారు. అలాగే ఈ కథనానికి రాజస్థాన్ ఎడారి ఇసుక దిబ్బలు కావాలి, కానీ వైసీపీ APలోని నదీ తీరాల నుండి దోచుకుంది, కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయి. చీర్స్!! అంటూ పవన్ కళ్యాణ్ తన ట్వీట్ ను ముగించారు. తద్వారా తమపై విమర్శలు చేస్తన్న జగన్ అమాయకుడేమీ కాదని పవన్ చెప్పుకొచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+