pawan kalyan: దళపతి విజయ్ రాజకీయ పార్టీపై పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్!

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ కొత్త పార్టీ పెట్టడం ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో సంచలనంగా మారింది. తమిళనాడులో తమిళ స్టార్ హీరో విజయ్ నిన్న తన పార్టీ తమిళగ వెట్రి కళగం తొలి సభను నిర్వహించారు. నిన్న రాజకీయ సమర శంఖారావం పూరించిన విజయ్ విల్లుపురం జిల్లా విక్రవండిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో తమ రాజకీయ పంధా ఏ విధంగా ఉంటుందో అందరికీ అర్థమయ్యేలా చెప్పారు.

తన పార్టీ సిద్ధాంతాలను, పంధాను చెప్పిన దళపతి విజయ్
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమిళనాడులో అన్ని స్థానాలలో పోటీ చేస్తామని, డిఎంకెను తమ రాజకీయ ప్రత్యర్థిగా భావిస్తామని, ఇక బిజెపితోను సిద్ధాంతపరంగా విభేదిస్తామని తెలిపిన విజయ్ తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. తమకు మద్దతు ఇచ్చే పార్టీలతో కలిసి నడుస్తామని చెబుతూనే, పొత్తులకు తాము వ్యతిరేకం కాదు అన్న సంకేతాలను కూడా విజయ్ పంపించారు.

Pawan Kalyan sensational post on Thalapathy vijay political party

పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్
తాజాగా విజయ్ కొత్త పార్టీ పెట్టి తమ పార్టీ సిద్ధాంతాలను వెల్లడించడంతో విజయ్ పార్టీ పైన విజయ్ రాజకీయ ప్రస్థానం పైన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన పోస్ట్ పెట్టారు. తమిళ స్టార్ హీరో విజయ్ కొత్త పార్టీ పెట్టడం పైన పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. హీరో విజయ్ కు తన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

విజయ్ పార్టీపై పవన్ చెప్పిందిదే
సాధుసంతవులు ఉన్న తమిళనాడు రాష్ట్రంలో పొలిటికల్ జర్నీ ప్రారంభించిన విజయ్ కు విషెస్ తెలియజేశారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ కు విజయ్ కు చాలా పోలికలు ఉన్నాయని తాజాగా విజయ్ పార్టీ పెట్టిన తర్వాత పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ సైతం ఇదే తరహాలో సినీ రంగం నుంచి వచ్చి పార్టీ పెట్టి ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో కీలక వ్యక్తిగా ఎదిగారు.

పవన్ తరహాలో రాజకీయాల్లో విజయ్ దూకుడుపై చర్చ
పవన్ తరహాలో విజయ్ కూడా అదే విధంగా తమిళనాడు రాజకీయాలలో ఎదుగుతారని పలువురు విజయ్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. భారీ జన సందోహం మధ్య టీవీకే పార్టీ తొలి సభ విజయవంతం కావడంతో ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రంలో విజయ్ పార్టీ పైన ఆసక్తికర చర్చ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+