వితంతువులకు సోదరుడిగా.. రాఖీ గిఫ్ట్స్ పంపిన పవన్ కళ్యాణ్!
పవన్ కళ్యాణ్.. ఏపీ డిప్యూటీ సీఎం. పవన్ కళ్యాణ్ గురించి, ఆయనలో ఉన్న గొప్ప గుణాల గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజా సమస్యల కోసం పోరాటం చేసినా, గతంలో ఉన్న ప్రభుత్వాలను గట్టిగా ప్రశ్నించినా, ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పటికీ నేల విడిచి సాము చెయ్యని నాయకుడిగా ఆయనకు ఉన్న గుర్తింపు అంతా ఇంతా కాదు.
పవన్ కళ్యాణ్ గొప్ప లీడర్
రాజకీయ నాయకులలో పవన్ కళ్యాణ్ ని ఒక విభిన్న శైలి. ఏ పని చేసిన ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేయడం పవన్ కళ్యాణ్ లో ఉన్న గొప్ప గుణం. ఇక అటువంటి పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ సందర్భంగా చేసిన ఒక గొప్ప పని ఆయనను మరోమారు గొప్ప లీడర్ గా అందరికీ చూపిస్తుంది.

భర్తలను కోల్పోయిన వితంతువులకు చీరలు
ఇంతకీ పవన్ కళ్యాణ్ రాఖీ పండుగ నాడు ఏం చేశారు అంటే రాఖీ పండుగ సందర్భంగా పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం భర్తలను కోల్పోయిన వితంతువులకు చీరలు బహుమతిగా పంపారు. సుమారు నియోజకవర్గంలోని 1500 మంది వితంతువులు భర్తలను కోల్పోయి బాధపడుతున్నారని, వారందరికీ సోదరుడిగా తాను అండగా ఉంటానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
సోదరుడిగా తాను ఉన్నానన్న పవన్ కళ్యాణ్
వారిలో ఆత్మస్థైర్యం నింపేలా ప్రతి ఆడపడుచును గౌరవిస్తూ జనసైనికుల ద్వారా ప్రతి వితంతు మహిళకు చీరను బహుమానంగా పంపి, సోదరుడిగా తాను ఉన్నానన్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ నాయకులు రక్షాబంధన్ సందర్భంగా పవన్ కళ్యాణ్ కానుకగా పంపిన చీరలను ఇంటింటికీ తిరిగి వారికి అందజేశారు.
ఉద్వేగానికి లోనైన మహిళలు
పవన్ కళ్యాణ్ తమకు రాఖీ కానుక పంపడంతో, సోదరుడిగా అండగా ఉన్నానని చెప్పడంతో మహిళలు ఉద్వేగానికి లోనయ్యారు. పవన్ కళ్యాణ్ తమ పట్ల చూపిస్తున్న ఆదరణకు వారు ఆనందం వ్యక్తం చేశారు. భర్త పోయిన తర్వాత తాము నిరాకరణకు గురవుతున్నామని బాధపడుతున్న ఎంతోమంది మహిళలు, పవన్ కళ్యాణ్ చేసిన పనితో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వితంతు మహిళలకు రక్షాబంధన్ బహుమతులు
పవన్ కళ్యాణ్ కు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ లాంటి గొప్ప వ్యక్తి తమ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఉండడం గర్వంగా ఉందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ బాటలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ జనసేన నాయకులు, వితంతు మహిళలకు రక్షాబంధన్ బహుమతులు పంపిణీ చేశారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications