అధిక ధరలకు మద్యం విక్రయిస్తే, ఇక - తేల్చి చెప్పిన పవన్.!!

రాష్ట్రంలో మద్యం అధిక ధరలకు విక్రయాల పై పవన్ స్పందించారు. వరుస ఫిర్యాదుల పై పవన్ స్పందించారు. తాజాగా పార్టీ జనరల్ బాడీ సమావేశంలో పాల్గొన్న పార్టీ ఎంపీలు.. ఎమ్మెల్యేల తో పలు అంశాల పైన చర్చించారు. అదే సమయంలో తన వద్దకు వస్తున్న వరుస ఫిర్యాదులను ప్రస్తావించారు. కాకినాడ జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి అధిక ధరలకు మద్యం అమ్మకాలు చేస్తున్న అంశం గురించి చర్చకు వచ్చింది. దీని పైన తాజాగా డిప్యూటీ సీఎం కార్యాలయం చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.

డిప్యూటీ సీఎం పవన్ మద్యం అధిక ధరలకు విక్రయించటం పైన ఆగ్రహం వ్యక్తం చేసారు. ఈ అంశం పైన ట్వీట్ చేసారు. అధిక ధరలకు మద్యం విక్రయించడం నిబంధనలకు విరుద్ధంగా పేర్కొన్నారు. మద్యం దుకాణదారులు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దని సూచించారు. తన వద్దకు వరుసగా పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుల పై పవన్ స్పందించారు.

Pawan Kalyan seriously reacts on selling liquor at high prices Key Directions for Excise officials and administration

ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం చేసిన ట్వీట్ లో.." రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం విక్రయాలు జరుగుతున్నట్టు డిప్యూటీ సీఎం పవన్ కు ఫిర్యాదు అందింది. కాకినాడ జిల్లాతోపాటు రాష్ట్రం నలుమూలల నుంచి ఈ తరహా ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 'అధిక ధరలకు మద్యం విక్రయాలు చేపట్టడం నిబంధనలకు విరుద్దం. అది ప్రభుత్వానికి చెడ్డ పేరు కూడా తెస్తుందని పేర్కొన్నారు.

ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దు

దీనికి కొనసాగింపుగా మద్యం విక్రయాల వ్యవహారంలో దుకాణదారులు కచ్చితంగా నిబంధనలు పాటించాలని స్పష్టం చేశారు. సంబంధిత శాఖ అధికారులు మద్యం దుకాణాలపై నిరంతర నిఘా ఏర్పాటు చేసి అధిక ధరలకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు ఈ ట్వీట్ ను ఎక్సైజ్ శాఖ తో పాటుగా ఆ శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ట్యాగ్ చేసారు. దీని ద్వారా మద్యం అధిక ధరలకు విక్రయించే వారి విషయంలో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. కొంత కాలంగా ఈ తరహా ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో, ఇప్పుడు పవన్ ఈ అంశం పైన స్పందించారు. డిప్యూటీ సీఎం తాజా స్పందనతో ఎక్సైజ్ అధికారులు ఈ విషయంలో ఇప్పుడు ఏ విధంగా స్పందిస్తారు.. ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+