జనసేన ప్రచార కమిటీ చైర్మన్‌గా సినీనిర్మాత బన్నీవాసు నియామకం వెనుక పవన్ కళ్యాణ్ వ్యూహం!!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకొని వచ్చే ఎన్నికలలో అధికారాన్ని చేపట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు అట్టే సమయం లేకపోవడంతో రంగంలోకి దిగిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ గా టాలీవుడ్ నిర్మాత బన్నీ వాసును నియమించారు.
సినీ పరిశ్రమకు చెందిన బన్నీవాసును పవన్ కళ్యాణ్ ప్రచారకమిటీ చైర్మన్ గా ఎందుకు నియమించారు అన్నది ప్రస్తుతం రాజకీయవర్గాలలో జరుగుతున్న చర్చ. పవన్ కళ్యాణ్ తనకు సన్నిహితుడైన బన్నీ వాసుకు అవకాశం ఇవ్వడం వెనుక బలమైన కారణమే ఉందని తెలుస్తుంది. పార్టీలో ముందు నుంచి కీలకంగా పనిచేస్తున్న చాలామంది పొలిటికల్ లీడర్లకు కాకుండా, బన్నీ వాసుకు పవన్ కళ్యాణ్ ప్రచారకమిటీ బాధ్యతలు అప్పగించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్టు తెలుస్తుంది.

సినిమాల విషయంలో మాత్రమే కాకుండా, రాజకీయాల విషయంలో కూడా బన్నీ వాసు దగ్గర మంచి మార్కెటింగ్ స్ట్రాటజీలు ఉన్నట్టు సమాచారం. అతనికి పొలిటికల్ అడ్వర్టైజింగ్ లో ఇప్పటికే మంచి అనుభవం ఉందని కూడా తెలుస్తుంది. మంచి పిఆర్ బలంతోపాటు యువతను ఆకట్టుకునేలా క్యాంపెయిన్ ఐడియాలు, గతంలో మారుతితో కలిసి ప్రజారాజ్యం కోసం పనిచేసిన అనుభవం ఇవన్నీ బన్నీ వాసుకు కలిసొస్తాయి.
అందుకే పవన్ కళ్యాణ్ ప్రచార కమిటీ చైర్మన్ గా బన్నీ వాసును ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. జనసేన పార్టీకి సానుభూతి పరుడు గా, పవన్ కళ్యాణ్ కు అత్యంత సన్నిహితుడుగా ఉన్న బన్నీ వాసు ఈసారి ఎన్నికలలో పోటీ చేయాలని కూడా భావిస్తున్నారు. ఆయన టికెట్ విషయం అటుంచితే కీలకమైన బాధ్యతను పవన్ కళ్యాణ్ అప్పగించడంతో ఆయన టీం రంగంలోకి దిగింది.
అధికార వైఎస్ఆర్సిపి వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టేందుకు బన్నీ వాసు టీం రెడీ అయినట్టుగా సమాచారం. ఏది ఏమైనా ఈసారి బన్నీ వాసు టీం తో జనసేన ఎన్నికల ప్రచారం అదిరిపోయేలా ఉంటుందని రాజకీయ వర్గాలలో చర్చ జరుగుతుంది.












Click it and Unblock the Notifications