అందులో చంద్రబాబును మించిపోయిన పవన్ కళ్యాణ్: వైసీపీ సంచలనం!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనలో దూసుకుపోతుందని, కేంద్రం కూడా ఏపీ అభివృద్ధికి అనేక విధాలుగా సహకరిస్తుందని ఎన్డీఏ కూటమి నేతలు, మంత్రులు చెబుతున్నారు. ఆరు నెలల ఎన్డీఏ పాలనలో పంచాయతీరాజ్ శాఖ అనేక మైలురాళ్లను దాటిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసిన వైసీపీ
ఇక ఈ నేపథ్యంలో వైసిపి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ట్విట్టర్ వేదికగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను విమర్శించింది. గోరంతను కొండంతగా చేసి చూపించడంలే సీఎం చంద్రబాబుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మించిపోయారని వైసీపీ ఎక్స్ లో పేర్కొంది. గత ఐదేళ్ల పాలనలో ఏపీ పంచాయతీరాజ్ శాఖ కింద కేవలం 1800 కిలోమీటర్లు మాత్రమే సిసి రోడ్లు నిర్మించారని పేర్కొంది.

Pawan Kalyan surpasses Chandrababu on goebbels publicity YCP sensational tweet in X over pawan kalyan tweet on panchayat raj dept roads X YCP

పవన్ కళ్యాణ్ గురువును మించిన శిష్యుడయ్యాడని సెటైర్లు
కానీ 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆరు నెలల్లోనే 3750 కిలోమీటర్ల సిసి రోడ్లను నిర్మించారని పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ను ఉటంకిస్తూ టార్గెట్ చేసిన వైసిపి అబద్ధాలు, అసత్యాలను ప్రచారం చేయడంలో పవన్ కళ్యాణ్ గురువును మించిన శిష్యుడయ్యాడని సెటైర్లు వేశారు. టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న రోడ్లలో గుంటలను పూడ్చడమే కానీ కొత్త రోడ్లు వేసింది మాత్రం లేదని పేర్కొన్నారు.

కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుంది
ఇక రాష్ట్రవ్యాప్తంగా గుంతలు పూడ్చటానికి ఖర్చు చేసింది 860 కోట్ల రూపాయలు మాత్రమేనని, ఇక కొత్త రోడ్ల నిర్మాణం ఎప్పుడు జరిగిందో చెప్పాలని ప్రశ్నించారు. కొత్త రోడ్ల నిర్మాణ బాధ్యతల నుంచి ప్రభుత్వం పూర్తిగా తప్పుకుందని పిపిపి విధానంలోనే కొత్త రోడ్లను వేస్తామని ప్రకటించి వాహనదారుల నుండి భారీగా టోల్ ఫీజులు బాదేందుకు రంగం సిద్ధం చేసుకుందని వైసిపి పేర్కొంది.

పవన్ కళ్యాణ్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది
ఇక టిడిపి పెద్దలు కాంట్రాక్టర్లుగా మారతారని టోల్ వసూలు చేస్తారని ఆరోపించింది. గతంలో వైసిపి ప్రభుత్వ హయాంలో ఒక సంవత్సరం కోవిడ్ తో ఇబ్బంది పడ్డామని ఆ తర్వాత నాలుగేళ్ల కాలంలో 43 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసి రోడ్లను నిర్మించామని పేర్కొంది. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అంటూ వైసీపీ ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+