పవన్ కళ్యాణ్ సీఎం కావాలి: జనసేనకు భోళా శంకర్ స్టంట్ మ్యాన్ విరాళం!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన ప్రజా మద్దతు కూడగట్టడం కోసం ప్రయత్నం చేస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ పక్క సినిమాలు చేస్తూనే, మరోపక్క రాజకీయాలలో తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నిస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికలలో టిడిపితో పొత్తుతో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విభిన్న వర్గాల ప్రజలకు అండగా పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. ఇక తాజాగా పవన్ కళ్యాణ్ జనసేనకు స్టంట్ మ్యాన్ బద్రి విరాళం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎంతో సేవ చేయాలని ఆకాంక్షిస్తూ, 50,000 రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా అందజేశారు.

28 సంవత్సరాల క్రితం పవన్ కళ్యాణ్ గారు చేసిన సాయమే తనను నిలబెట్టిందని, సార్ చేసిన సాయం తనతో ఆగిపోకూడదు అని పేర్కొన్న స్టంట్ మ్యాన్ బద్రి పవన్ కళ్యాణ్ ఎందరికో సహాయం అందిస్తున్నారని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే తనలాంటి వారికి ఎంతో మందికి అండగా నిలుస్తారని ఆకాంక్షతోనే భోళా శంకర్ సినిమాతో వచ్చిన పారితోషకాన్ని జనసేన పార్టీకి విరాళంగా ఇస్తున్నానని స్టంట్ మాన్ బద్రి పేర్కొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సినిమాలలో కార్లను పట్టీలు కొట్టించి చేసే డేర్ డెవిల్ స్టంట్స్ ఎంతో కష్టసాధ్యమైనవని, ఎంతో సాహసంతో కూడుకున్నవని తెలుగు చిత్ర పరిశ్రమలో అలాంటి స్టంట్స్ చేయడం బద్రి గారికి మాత్రమే సాధ్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేసే సాయం నాతో ఆగిపోకూడదు - జనసేనకు విరాళం అందించిన స్టంట్ మ్యాన్ శ్రీ బద్రి pic.twitter.com/450cbn8GlC
— JanaSena Party (@JanaSenaParty) September 27, 2023
విశాఖలో నటనలో శిక్షణ తీసుకున్నప్పటి నుండి బద్రితో పరిచయం ఉందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ భోళా శంకర్ చిత్రంలో చేసిన స్టంట్స్ కి ఆయనను అభినందించారు. నేడు బద్రి హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. సినిమాలో చేసిన స్టంట్స్ కి గాను తాను అందుకున్న పారితోషకం 50 వేల రూపాయలు జనసేన పార్టీకి విరాళంగా అందజేయగా పవన్ కళ్యాణ్ బద్రి కి ధన్యవాదాలు తెలిపారు.
-
చిరంజీవి, నాగబాబు గురించి పవన్ భార్య "అన్నా" సంచలన పోస్ట్..! -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications