సచివాలయానికి పవన్ కళ్యాణ్.. రాజధాని రైతుల పూలవర్షం.. చంద్రబాబు సాదర స్వాగతం
జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు విజయవాడలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. రేపు డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టనున్న పవన్ కళ్యాణ్ ఈ క్రమంలో నేడు తన క్యాంపు కార్యాలయాన్ని పరిశీలించడంతోపాటు, సచివాలయంలోని తన పేషీని పరిశీలించడానికి అమరావతి వచ్చారు.
పవన్ పై రాజధాని రైతుల పూలవర్షం
ఈ సందర్భంగా రాజధానిలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ కు రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించారు. పెద్ద గజమాలతో జనసేనాని పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. వెంకటపాలెం నుండి మందడం గ్రామం వరకు రోడ్డుపై పూలు చల్లుతూ జనసేనాని పవన్ కళ్యాణ్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు.

పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్లి చంద్రబాబు సాదర స్వాగతం
రేపు పవన్ కళ్యాణ్ గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ త్రాగునీటి సరఫరా, పంచాయతీరాజ్, పర్యావరణ, అడవులు, శాస్త్ర సాంకేత్రిక మంత్రిత్వ శాఖల మంత్రిగా బాధ్యతలను చేపట్టనున్నారు. ఈ క్రమంలో సచివాలయానికి వెళ్ళిన పవన్ కళ్యాణ్ కు ఏపీ సీఎం చంద్రబాబు సాదర స్వాగతం పలికారు. పవన్ కళ్యాణ్ సచివాలయ సందర్శన నేపథ్యంలో సీఎం చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు ఎదురెళ్లి మరి స్వాగతం పలకడం విశేషం.
పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు.. ఆసక్తికర సంభాషణ
పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు ఈ మేరకు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు ఛాంబర్ లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్న ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపించి ఆ గుర్తుకు మీరు వన్నె తీసుకువచ్చారంటూ కొనియాడారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు చంద్రబాబు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఇరువురు కాసేపు భేటీ అయ్యి ఏపీ పాలన పైన అనేక విషయాలను చర్చించారు.
చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కళ్యాణ్
ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చంద్రబాబు పవన్ కళ్యాణ్ భేటీ కావడం ఇదే మొదటిసారి. ఇక పవన్ కళ్యాణ్ చాంబర్ కి వచ్చిన పలువురు అధికారులు ఆయనను కలిశారు. పవన్ కళ్యాణ్ తనకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ తో పాటు సచివాలయానికి వచ్చిన వాళ్ళల్లో మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు.
-
ఇకపై "నో".. పవన్ మూవీ కారణంగా నటుడి సంచలన నిర్ణయం -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్డే గిఫ్ట్ మామూలుగా లేదుగా!












Click it and Unblock the Notifications