డిప్యూటీ సీఎం పవన్ ముందు పెను సవాళ్లు..!!
పవన్ కళ్యాణ్ అభిమానులంతా వేచి చూసిన శుభసమయం ఈ రోజు వచ్చింది. ఈరోజు ఏపీ డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత, పిఠాపురం ఎమ్మెల్యే కొణిదల పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి విజయవాడ చేరుకున్న ఆయన క్యాంపు కార్యాలయంలోకి ఉపముఖ్యమంత్రిగా తొలిసారి అడుగుపెట్టారు.
డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్
అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి ఉపముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలను స్వీకరించారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరిస్తూ సంతకం పెట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం పలు ఫైళ్లపైన ఆయన సంతకాలు చేశారు.

ఫైళ్ళపై సంతకాలు.. పని మొదలెట్టిన జనసేనాని
ఉపాధి హామీ పథకానికి ఉద్యానవన పనులను అనుసంధానం చేసే ఫైల్ పైన, అలాగే గిరిజన గ్రామాల్లో పంచాయతీ భవనాల నిర్మాణ ఫైలు పైన పవన్ కళ్యాణ్ సంతకాలు చేశారు. అనంతరం సోదరుడు నాగబాబు, జనసేన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ తో పాటు, ఎమ్మెల్యేలు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వివిధ శాఖల అధికారులు పవన్ కళ్యాణ్ కు అభినందనలు తెలియజేశారు.
మంత్రిగా పవన్ పై పెద్ద బాధ్యతలే
ఇక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ మీద పెద్ద బాధ్యత నే ఉందని చెప్పాలి. ఐదు కీలక శాఖలు పవన్ కళ్యాణ్ ఒంటి చేత్తో నిర్వహించాల్సిన పరిస్థితి. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, పర్యావరణ, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖలకు సహాయ మంత్రులు కూడా లేకుండా ఆయన ఒక్కరే నిర్వహించాల్సిన పరిస్థితి. దీంతో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ ముందు అనేక పెను సవాళ్ళే ఉన్నాయి.
పవన్ ముందున్న మేజర్ టాస్క్ లు ఇవే
సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చి, పంచాయతీరాజ్ వ్యవస్థను జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేసిన క్రమంలో పంచాయతీరాజ్ వ్యవస్థను పవన్ గాడిన పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్రంలోని అనేక మారుమూల తండాలు, గ్రామాలలో తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ఇక పర్యావరణాన్ని పరిరక్షించడానికి, అడవులను కాపాడడానికి, అటవీ సంపదను సంరక్షించడానికి పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఏరి కోరి తీసుకున్న శాఖలలో పవన్ మార్క్ కనిపించేలా పనిచేస్తారా లేదా అన్నది ముందు ముందు తెలియనుంది.
-
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే!












Click it and Unblock the Notifications