వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బానిసలనుకోవద్దు.. జల్లికట్టుకు-హోదాకు లింకు ఇదే!: బాబుకు పవన్ చురకలు

నాయకులు మీకు' జి హుజూర్' అని వంగి వంటి సలాములు చెయ్యడం చూసి 'ఆంధ్రులు మీ బానిసలు' అని పొరబడవద్దని కేంద్రాన్ని పవన్ గట్టిగా హెచ్చరించారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌: ప్రత్యేక హోదా అంశం ఏపీని హీటెక్కిస్తోంది. ఓవైపు జనసేన పవన్, మరోవైపు ప్రతిపక్షం వైసీపీ హోదాపై పోరాటానికి సిద్దమవుతుండటంతో రాష్ట్రంలో దీనిపై తీవ్ర చర్చ జరుగుతోంది.

ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ ట్విట్టర్ వేదికగా.. ఈ అంశాన్ని బలంగా జనంలోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం మెడలు వంచడమే లక్ష్యంగా ఏపీ ప్రజల్లో పోరాట స్పూర్తిని నింపేలా ఆయన ట్విట్స్ చేస్తున్నారు.

జల్లికట్టు ఉద్యమస్పూర్తితో రేపు విశాఖ ఆర్కే బీచ్ లో తలపెట్టిన ప్రత్యేక హోదా నిరసన కార్యక్రమానికి భారీ ఎత్తున మద్దతు లభిస్తోన్న సంగతి తెలిసిందే. పోలీసులు మాత్రం దీనికి అనుమతిచ్చేది లేదని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ట్విట్టర్ వేదికగా కేంద్రానికి గట్టి హెచ్చరికలు జారీ చేశారు.

జల్లికట్టు-హోదాకు లింకేమిటి?

జల్లికట్టు స్పూర్తితో ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నిర్మించడానికి ఏపీ ప్రజలు సమాయత్తమవుతున్న తరుణంలో.. జల్లికట్టుకు-హోదాకు సంబంధమేంటి? అని ప్రభుత్వ వర్గాలు ముఖ్యంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే. దీనిపై కూడా పవన్ స్పందించారు.

'ఒక సాంప్రదాయాన్ని కాపాడుకోవడం కోసం తమిళులు అంతగా పోరాడుతున్నప్పుడు మన అవసరాల కోసం మనం ఇంకెంత పోరాటం చేయాలి. జల్లికట్టు స్పూర్తితో యువత ముందుకొస్తున్నప్పుడు.. కుదిరితే యువతకు సహకరించండి.. అంతేగానీ వారిని వెనక్కిలాగే ప్రయత్నం చేయకండి' అంటూ పవన్ చురకలంటించారు.

ఆంధ్రులు మీ బానిసలు కాదు:

ఆంధ్రుల ఆకాంక్షల పట్ల అలసత్వం వహిస్తున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని పవన్ తీవ్రంగా నిరసించారు. పదవులు కోరుకునేవారు, వ్యక్తిగత లాభం ఆశించేవారు, వ్యాపార అవసరాలున్న వ్యక్తులు, నాయకులు మీకు' జి హుజూర్' అని వంగి వంటి సలాములు చెయ్యడం చూసి 'ఆంధ్రులు మీ బానిసలు' అని పొరబడవద్దని కేంద్రాన్ని పవన్ గట్టిగా హెచ్చరించారు.

English summary
Janasena President Pawan Kalyan warned central govt on special status issue through twitter statements.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X