ఒక్కసారి గెలిచిన పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం.. మూడుసార్లు గెలిచినా బాలకృష్ణ మంత్రి కాలేడా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల్లో ఘనవిజయం సాధించి టిడిపి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. నేడు టిడిపి అధినేత చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తో పాటు మొత్తం 25 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక టిడిపి కూటమి సభ్యులకు కొందరికి కేంద్ర మంత్రుల పదవులు కూడా వరించాయి.

బాలయ్యకు దక్కని మంత్రి పదవి.. అభిమానులలో నిరాశ
అయితే హిందూపురం నియోజకవర్గం నుండి మూడుసార్లు ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొట్టిన నందమూరి బాలకృష్ణ కు మంత్రి పదవి దక్కకపోవడంతో అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కట్టుబడి పని చేసే వ్యక్తి బాలకృష్ణ చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో కూడా పార్టీని తనవంతుగా ముందుకు నడిపించే ప్రయత్నం చేశారు.

Pawan Kalyan who won once is deputy CM Balakrishna can t become minister even he won three times

ఎన్నికల్లో ప్రచార బాధ్యతలు భుజాలపై వేసుకున్న బాలయ్య
అంతేకాదు 2024 ఎన్నికలలో హిందూపురం నియోజకవర్గంలో మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో పర్యటించిన బాలయ్య పెద్ద ఎత్తున ప్రచారం చేసి కూటమి విజయానికి దోహదం చేశారు. ఇక టీడీపీలో నందమూరి వంశంలో ఏకైక రాజకీయ వారసుడిగా కొనసాగుతున్న బాలకృష్ణ టిడిపికి అన్ని సమయాలలోనూ వెన్నుదన్నుగా నిలిచారు. గతంలో వైసిపి ప్రభుత్వం కొనసాగిన సందర్భంలో కూడా హిందూపురం నియోజకవర్గం లో బాలయ్య విజయం సాధించి తన ప్రభంజనాన్ని చూపించారు.

బాలయ్యకు గుర్తింపు లేదంటూ అసహనం
అలాంటి బాలకృష్ణకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదు అని బాలయ్య అభిమానులతో పాటు ఏపీ ప్రజలు దీనిపైన చర్చించుకుంటున్నారు. ఏపీలో తొలిసారి గెలిచిన పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం గా అవకాశం ఇచ్చినా, మూడుసార్లు గెలిచిన బాలయ్యకు మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం పట్ల బాలకృష్ణ అభిమానులు పెదవి విరుస్తున్నారు. పార్టీ కోసం నిస్వార్ధంగా పనిచేసే బాలకృష్ణ కు తగిన గుర్తింపు ఇవ్వకపోవడం బాలయ్యను అవమానించడమేనంటున్నారు.

బాలయ్యకు మంత్రి పదవి ఎందుకు ఇవ్వలేదో.. చర్చ
2014లో టిడిపి విజయం సాధించిన సమయంలో కూడా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వలేదు. ఇక గత ఎన్నికలలో వైసిపి అధికారంలోకి రావడంతో బాలయ్య ఎమ్మెల్యేగా గెలిచినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు మూడవసారి బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించినప్పటికీ టిడిపి కూటమి అధికారంలోకి వచ్చినప్పటికీ చంద్రబాబు బాలయ్యను నిర్లక్ష్యం చేయడం మంత్రిగా అవకాశం ఇవ్వకపోవడం బాలయ్య ఫ్యాన్స్ కు తీవ్ర నిరాశను కలిగిస్తోంది. దీని వెనుక కారణం ఏమిటి అన్నది ఏపీ రాజకీయాలలో ఆసక్తికరంగా చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+