పవన్ కళ్యాణ్ కు ఈ విషయంలో సతీమణి స్ట్రోక్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో ప్రధాన పార్టీల అగ్ర నేతల కుటుంబ సభ్యులు సైతం ప్రచారంలో జోరుగా పాల్గొంటున్నారు. నీకు అండగా నేనున్నానంటూ భర్తకు బాసటగా కదులుతున్నారు. ముఖ్యంగా పార్టీల అధినేతల సతీమణులు ఎండలను సైతం లెక్కచేయకుండా చేస్తున్న ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఏపీలో ఆసక్తికరంగా మారింది.
బాబు కోసం భువనేశ్వరి, లోకేష్ కోసం బ్రాహ్మణి
గతానికి భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అలుపెరుగకుండా బాబు కోసం కష్టపడుతున్నారు. గత ఎన్నికలలో మంగళగిరిలో ఓటమిపాలైన భర్త లోకేష్ కోసం ఈ ఎన్నికలలో ఎలాగైనా గెలిపించాలని పట్టుదలతో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి ప్రచార పర్వాన్ని నిర్వహిస్తున్నారు.

జగన్ కోసం భారతి.. మరి పవన్ కోసం
ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలలో వైసీపీకి మరోమారు పట్టం కట్టండి అంటూ వైసీపీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కోసం ఆయన సతీమణి భారతి రెడ్డి పులివెందులలో జగన్ కోసం ప్రచారాన్ని సాగించనున్నారు. ఇక ప్రధాన పార్టీల అధినేతల సతీమణులు అందరూ ఎన్నికల ప్రచారంలో జోరుగా ముందుకు సాగుతుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఈ విషయంలో వెనుకబడిపోయాడు.
ఎందరిని పెళ్లి చేసుకుంటే ఏం లాభం పవన్
నిత్యం పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యల గురించి రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. ముఖ్యంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి పవన్ పెళ్లిళ్ల గురించి ఆయన భార్యల గురించి పదేపదే కామెంట్ చేయటం అందరికీ తెలిసిందే. తాజాగా ఎన్నికల సమయంలో ఆయన పరిస్థితిని చూసిన వారంతా ఎందరిని పెళ్లి చేసుకుంటే ఏం లాభం ప్రచారం చేయడానికి ఒక్కరు కూడా జనాలలోకి రాకపోయే అంటూ చెప్పుకుంటున్నారు.
ఈ విషయంలో బాగా వెనుకబడ్డ పవన్
ప్రధాన పార్టీల అధినేతల భార్యలంతా ప్రజలలోకి వెళ్లి తమ భర్తలను గెలిపించమని ప్రాధేయ పడుతుంటే, పవన్ కళ్యాణ్ కోసం ప్రస్తుతం ఆయన సతీమణి అన్నా లెజ్నేవా ఎన్నికల ప్రచారానికి మాత్రం దూరంగా ఉన్నారు. ఆమె ప్రజల్లోకి వెళ్ళినా భాష సమస్య కారణంగా మాట్లాడలేరు. ఇక ఈ విషయంలో ఏపీ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ మిగతా పార్టీల నాయకుల కంటే వెనకబడిపోయారు. దీంతో ఇది ఆలోచించిన ప్రతి ఒక్కరు పాపం పవన్ కళ్యాణ్ అంటున్నారు.












Click it and Unblock the Notifications