సీఎం రేవంత్ రెడ్డికి పవన్ కళ్యాణ్ కితాబు.. పలు సూచనలు!!

తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. సీఎం గా బాధ్యతలు కూడా స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడంతో, కాంగ్రెస్ పార్టీ విజయానికి కారణమైన రేవంత్ రెడ్డికి సీఎంగా అవకాశం కల్పించారు. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎల్బీ స్టేడియంలో అట్టహాసంగా జరిగింది.

అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రాజకీయ ప్రముఖులను, సినీ ప్రముఖులను ఆహ్వానించిన రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను మాత్రం ఆహ్వానించలేదని సమాచారం. ఒక రాజకీయ పార్టీ అధినేతగానూ, సినీ సెలబ్రిటీ గాను రేవంత్ రెడ్డి పవన్ కళ్యాణ్ కు ప్రాధాన్యత ఇవ్వలేదని టాక్ వినిపించింది. అందుకు కారణం కూడా లేకపోలేదు. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన బిజెపితో పొత్తు పెట్టుకోవడమేనని తెలుస్తుంది.

Pawan Kalyan wished and praised CM Revanth Reddy.. gave suggestions for telangana!!

అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ట్విట్టర్ వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులకు శుభాభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసిన పవన్ కళ్యాణ్ రేవంత్ రెడ్డి గారితో తనకు వ్యక్తిగతంగా స్నేహం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారని, తమ పార్టీ అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారని పేర్కొన్నారు. వాగ్దాటి, ప్రజాకర్షణ కలిగిన ఆయన రాజకీయంగా ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొంటూ పోరాటాలు చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ఉద్యమాలు, వాటి నేపథ్యాల పై సంపూర్ణ అవగాహన ఉన్న నాయకుడు రేవంత్ రెడ్డి గారని తెలిపారు. ఎముకలు ప్రధాన అంశాలుగా పోరాడి సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన యువత ఆత్మబలిదానాలు చేసిందో వాటిని సంపూర్ణంగా నెరవేర్చి, ఆ త్యాగాలకు గౌరవాన్ని, సార్ధకతను కల్పించాలని పవన్ కళ్యాణ్ కి సందర్భంగా ఆశాభావం వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమం, అభివృద్ధితో తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాలని తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇక ఇప్పటికే వైఎస్. జగన్, చంద్రబాబు, నారా లోకేష్ లు రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+