చంద్రబాబు మనవడికి పవన్ ట్వీట్..! ఆ హోదాలో నువ్వు..

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా వ్యవహరించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత డిప్యూటీ సీఎం అయ్యారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబుతో అన్ని విధాలా సమన్వయంతో వ్యవహరిస్తున్న ఆయన.. సందర్భం వచ్చినప్పుడు ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యుల్ని ప్రశంసిస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్ -బ్రాహ్మణి కుమారుడు నారా దేవాన్ష్ పై పవన్ ప్రశంసలు కురిపించారు.

చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ తాజాగా చెస్ క్రీడల్లో వేగంగా పజిల్స్ పరిష్కరించి వరల్డ్ రికార్డు సృష్టించారు. 175 క్లిష్టమైన చెస్ పజిల్స్‌ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకన్లలోనే పూర్తిచేసి 'ఫాస్టెస్ట్‌ చెక్‌మేట్‌ సాల్వర్‌'గా నారా దేవాన్ష్.. వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ప్రసిద్ధ చెస్‌ సంకలనం నుంచి ఎంపిక చేసి న 5,334 సమస్యలు, కలయికలతో ఏర్పాటు చేసిన కాంపిటీషన్ లో దేవాన్ష్ విజయం సాధించి ధృవపత్రం అందుకున్నాడు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ భవన్‌లో ఈ పోటీ జరగగా.. లండన్‌కు చెందిన వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ దేవాన్ష్ కు సర్టిఫికెట్‌ ఇచ్చింది.

pawan kalyan wishes Chandrababu s grand son nara devansh to become grand master in chess

దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలస్యంగా స్పందించారు. దీంతో నేరుగా పవన్ ట్వీట్ చేయకుండా ఏపీ డిప్యూటీ సీఎంవో ఎక్స్ హ్యాండిల్ నుంచి ఈ ట్వీట్ పెట్టారు. మంత్రి నారా లోకేష్ తనయుడు, సీఎం చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ కేవలం 11 నిమిషాల 59 సెకండ్లలో 175 చెస్ పజిల్స్ పూర్తి చేసి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అంటూ పవన్ ట్వీట్ లో తెలిపారు. పిన్న వయసులోనే చెస్ లో అత్యుత్తమ ప్రతిభను కనబరచిన దేవాన్స్ భవిష్యత్తులో మరిన్ని రికార్డులు నెలకొల్పి, గ్రాండ్ మాస్టర్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ముగించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+