Pawan Kalyan: ఏపీ సర్కార్ పై పవన్ ముద్ర..! కేబినెట్ నుంచి అడవుల వరకూ..!
ఏపీ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఏడాది రాజకీయంగా ఎన్నో విజయాలు అందుకున్నారు. అంతకుమించి ప్రభుత్వ పాలనపై తనదైన ముద్ర వేశారు. గత వైసీపీ ప్రభుత్వాన్ని పలుమార్లు ప్రశ్నించి జనసేనను రాజకీయంగా నిలబెట్టిన పవన్ ఈసారి కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నా సమస్య కనిపిస్తే చాలు ప్రశ్నిస్తూనే వస్తున్నారు. ప్రభుత్వం చేసే మంచి పనుల్లో భాగస్వామి అవుతూనే మరోవైపు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వానికి మార్గదర్శనం చేస్తున్నారు. అలాగే క్షేత్రస్ధాయిలో పర్యటనలు చేస్తూ సమస్యలు పరిష్కరిస్తున్నారు.
రాష్ట్రంలో గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో సమీక్షలకే పరిమితం అయిన పవన్ ఈ ఏడాది మాత్రం తన శాఖపై పట్టు పెంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఇందులో భాగంగా ఎప్పటికప్పుడు వివరాలు తెప్పించుకుంటూ, తదనుగుణంగా అధికారులకు ఆదేశాలు ఇస్తూ సమస్యలకు పరిష్కారాలు చూపుతున్నారు. కుంకీ ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్నాటక ప్రభుత్వంతో చర్చలు జరిపి ఫలితం సాధించడం ఇందుకు నిదర్శనం.

అమరావతిలో రెండోవిడత భూసేకరణ విషయంలో ప్రభుత్వాన్ని కేబినెట్ లోనే ప్రశ్నించిన పవన్.. ఆ మేరకు విధానపరమైన మార్పులు తీసుకురాగలిగారు. దీంతో ముందు 44 వేల ఎకరాలు తీసుకుందామని అనుకున్న ప్రభుత్వం కాస్తా 16 వేల ఎకరాలకు తగ్గింది. అలాగే లులూ మాల్ అడిగిన రాయితీలన్నీ ఇచ్చినా బ్లాక్ మెయిల్ కు దిగడాన్ని కూడా కేబినెట్లోనే పవన్ ప్రశ్నించారు. అంతేకాదు ఇంకా పలు అంశాలపై కేబినెట్లో పవన్ వేసిన ప్రశ్నలు ప్రభుత్వ నిర్ణయాల్ని మార్చుకునేలా చేశాయి.

అలాగే ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా పలు గ్రామీణ ప్రాంతాల్లో పవన్ పర్యటనలు సాగాయి. అది విశాఖ మన్యంలో పర్యటన అయినా, శేషాచలం అడవుల్లో ఎర్రచందనంపై క్షేత్రస్థాయి సమీక్ష అయినా పవన్ మాత్రం దూకుడుగా ముందుకెళ్లారు. తన శాఖ పరంగా అవినీతి మరకలు లేకుండా పాలన సాగించడంలోనూ పవన్ సక్సెస్ అయ్యారు. ఇప్పటివరకూ పవన్ నిర్వహిస్తున్న అటవీ, గ్రామీణాభివృద్ధి శాఖలపై తనదైన ముద్ర వేశారు. కుంకీ ఏనుగుల ప్రయోగం, పల్లెపండుగల్లో విజయాలే ఇందుకు నిదర్శనం. ఆయా కార్యక్రమాలతో ప్రభుత్వంపై పవన్ పట్టు కూడా బాగా పెరిగింది.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications