వైసీపీ మళ్లీ రాదు..! అధికారులకు పవన్ గ్యారంటీ..! అప్పుడే గొడవ పెట్టుకుంటా..!
ఏపీలో వైసీపీ నేతల విమర్శలు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ ఘాటు కౌంటర్ ఇచ్చారు. అయినా తాము రాజ్యాంగ పరిధిలోనే పోరాటం చేస్తామనని, చివరి దశలో మాత్రమే గొడవ పెట్టుకుంటామని తెలిపారు. ఆ గొడవ చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. చొక్కా మడిచి ముందుకు వెళతమన్నారు. సయోధ్యగా ఎంత మాట్లాడతారో అప్పటివరకు శాంతంగా ఉంటానని, మీరు కూడా చర్చ చేయాలని, వాదించాలని, ఆమోదయోగ్యమైన భాషలో మాట్లాడాలని పవన్ సూచించారు.
శాంతి భద్రతలు దెబ్బతింటే పర్యాటకం కూడా దెబ్బతింటుందని పవన్ తెలిపారు. జగన్ పోలీసు అధికారుల్ని తిడుతూ...మేం వస్తే కాంట్రాక్టర్లను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తుంటే చాలా తప్పుడు సంకేతం వెళ్తుందన్నారు. పర్యాటకం ఒక్కటే కాదు పెట్టుబడులు, అభివృద్ధి అన్ని విషయాల్లోనూ అది రాంగ్ సిగ్నల్ పంపుతుందన్నారు. శాశ్వతంగా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తనకు తెలుసన్నారు. వైసీపీ నాయకులు బెదిరింపులు మానేయాలని, ప్రజాస్వామ్య భాషకు రావాలని సూచించారు. వైసీపీ మళ్లీ రాదనే విషయం అధికారులు తెలుసుకోవాలన్నారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రావన్నారు.

తెనాలిలో గంజాయి తాగిన రౌడీలను పోలీసులు కొడితే న్యాయవ్యవస్థను అడ్డం పెట్టుకొని వైసీపీ నాయకులు రౌడీలకు మద్దతుగా వెళ్లారని, పోలీసులు వీరి చర్యలకు భయపడుతున్నారని పవన్ తెలిపారు. ఏదైనా చేస్తే వీళ్లు మళ్లీ అసాంఘిక శక్తులకు మద్దతుగా వెళ్తారు.. మాపై కేసులు వేస్తారని భయపడుతున్నారన్నారు. క్రిమినల్ ను దెబ్బ కూడా కొట్టకూడదు అంటే నేరాలు ఎక్కడ ఆగుతాయన్నారు. ఓ కుటుంబం బయటకు వస్తే వారిని ఎవరైనా ఏడిపిస్తే ఎవరికి చెప్పుకుంటారని ప్రశ్నించారు. శాంతిభద్రతలకు ఆటంకం కలిగితే పోలీసులకు అండగా నిలబడాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లకు కూడా భయాలున్నాయన్నారు.
ప్రైవేటు సెటిల్మెంట్ లు చేయొద్దని, న్యాయం వైపు నిలబడాలని, భూ పంచాయతీలు లాంటివి అసలు చేయొద్దని జనసేన నేతలకు పవన్ సూచించారు. మనం గత ప్రభుత్వానికి భిన్నంగా పనిచేయాలన్నారు. మన మీద ఎంతో నమ్మకంగా ఓట్లు వేసిన వారికి అండగా నిలబడకపోతే తల దించుకోవాల్సి వస్తుందన్నారు. తాను అలా తలదించుకోవడానికి సిద్ధంగా లేనన్నారు. ప్రజల అవసరమే తనకు ముఖ్యమన్నారు. పార్టీ కంటే కూడా సగటు ప్రజల భద్రత తనకు చాలా ముఖ్యమన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పోలీసుల కంట్రోల్లోకి రావాలన్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకండి, నేను నా అధికారాన్ని ఎప్పుడు కూడా దుర్వినియోగం చేయను, మీరు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోనని పవన్ తెలిపారు.












Click it and Unblock the Notifications