కోనసీమ కొబ్బరికి తెలంగాణ దిష్టి..! విభజన వెనుక ? పవన్ షాకింగ్..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కోనసీమ జిల్లా పర్యటనలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లాలో కొబ్బరిరైతుల కష్టాల్ని తెలుసుకునేందుకు అక్కడ పర్యటిస్తున్న పవన్.. తెలంగాణ నేతలు, రాష్ట్ర విభజన వంటి అంశాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు. గోదావరి జిల్లాల పచ్చదనం చూసి తెలంగాణ నేతలు ఓర్వలేకపోయారని, వారి దిష్టి తగిలిందని పవన్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
గోదావరి జిల్లాలు ఆంధ్రా అన్నపూర్ణ అంటారని పవన్ తెలిపారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాల పచ్చదనమే అన్నారు. తెలంగాణ నేతలు కొబ్బరి చెట్లతో, పచ్చదనంతో మీరు బాగుంటారని అంటారని గుర్తుచేసుకున్నారు. నరుడి దిష్టి నలభయ్యేళ్లు అంటారని, కానీ ఎంతమంది దిష్టి తగిలితే కొబ్బరి చెట్లు ఇలా అయిపోతాయని పవన్ ప్రశ్నించారు.
తెలంగాణ నాయకుల దిష్టి తగిలి కోనసీమలో కొబ్బరిచెట్లకు మొండాలు కూడా లేవన్నారు. కోనసీమ జిల్లాలకు అంత దిష్టి తగిలిందన్నారు. దీన్ని మనం సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

మరోవైపు కోనసీమ కొబ్బరి రైతులు తమకు ఆర్ధిక సాయం అందించాలని చేసిన విజ్ఞప్తిపైనా పవన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మీరేమో నన్ను సినిమాలు చేసి సమస్యల పరిష్కారం కోసం డబ్బులిమని అడుగుతారంటూ రైతుల్ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇదే మాట గత ముఖ్యమంత్రిని అడగాల్సిందంటూ జగన్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. వైసీపీ వాళ్ల దగ్గర డబ్బులు ఎక్కువగా ఉంటాయన్నారు. నా దగ్గర ఏముంటాయంటూ పవన్ తేల్చేశారు. రైతులకు సాయం ఎలా అందించాలన్న దానిపై అధికారులతో మాట్లాడతానని పవన్ హామీ ఇచ్చారు.
పవన్ వ్యాఖ్యలపై వైసీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల ఘాటుగా స్పందించారు. పడింది పక్క రాష్ట్రం ద్రుషిటి (దిష్టి) కాదు PPP గారు...! ఆంధ్ర రాష్ట్రం మీద పడింది ముగ్గురి దిష్టి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ అన్నారు. మీరు అధికారం లో ఉన్నప్పుడు సేద్య రంగం నాశనం అయితే ఆ నెపాన్ని పక్క రాష్ట్రం మీద నెట్టడం, లేదా ప్రతిపక్షం మీద తోసేయడం...! ఏమన్నా అంటే వరాలు ఇవ్వడానికి నేనేమైనా ముఖ్యమంత్రి నా అంటారు అంటూ సెటైర్లు వేశారు.
పడింది పక్క రాష్ట్రం ద్రుషిటి ( దిష్టి) కాదు PPP గారు…! ఆంధ్ర రాష్ట్రం మీద పడింది ముగ్గురి దిష్టి @ncbn @PawanKalyan @naralokesh
— Are Syamala (@AreSyamala) November 26, 2025
మీరు అధికారం లో ఉన్నప్పుడు సేద్య రంగం నాశనం అయితే ఆ నెపాన్ని పక్క రాష్ట్రం మీద నెట్టడం, లేదా ప్రతిపక్షం మీద తోసేయడం…!
ఏమన్నా అంటే వరాలు… pic.twitter.com/ZPl2OZBo0T












Click it and Unblock the Notifications