పొత్తు కావాలంటే: మోదీ ప్లాన్ తో పవన్ - కొత్త ట్విస్ట్ : చంద్రబాబు అంగీకరిస్తేనే..!!

టీడీపీ - జనసేన పొత్తు కావాలంటే తన షరతు ఏంటో పవన్ తేల్చి చెప్పేసారు. ఏపీలో ముందుగానే ఎన్నికలకు పార్టీలు సిద్దం అవుతున్న వేళ..పవన్ తన డిమాండ్ బయట పెట్టారు. తాను డామేజ్ కాకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎవరి పల్లకీ మోయనని స్పష్టం చేసారు. వైసీపీ ఓడించి తీరుతానని ధీమాగా చెబుతున్నారు. అన్ని పార్టీలను ఏకం చేస్తానని స్పష్టం చేసారు. అటు బీజేపీ నుంచి వస్తున్న ఆఫర్ వేళ పవన్ కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు. అటు బీజేపీ ..టీడీపీ తనతోనే ఉండేలా సరి కొత్త డిమాండ్ తెర పైకి తెచ్చారు. ఇది అమలైతేనే పొత్తు ఉంటుందనే సంకేతాలు ఇచ్చారు. మరి..చంద్రబాబు ఇందుకు అంగీకరిస్తారా.

పక్కా వ్యూహంతో పవన్ కల్యాణ్

పక్కా వ్యూహంతో పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ తన లక్ష్యం స్పష్టం చేసారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాదని చెబుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని శపథం చేసారు. తాను ఎవరికీ కొమ్ము కాయనని తేల్చి చెప్పారు. అదే సమయంలో 2014 పొత్తుల గురించి ప్రస్తావించారు. పొత్తులు లేని కారణంగానే 2019 లో జగన్ అధికారంలోకి వచ్చారని విశ్లేషించారు. వైసీపీని ఓడించే బాధ్యత తాను తీసుకుంటానని ముందుకొచ్చారు. వ్యూహం తనకు వదిలేయని సూచించారు. జనసేన అధికారంలోకి వస్తుందని ధీమాగా చెబుతున్నారు. ఇక్కడే పవన్ వ్యూహం పైన స్పష్టత వస్తోంది. విశాఖ కేంద్రంగా ప్రధానితో పవన్ భేటీ తరువాత టీడీపీ తో పొత్తు అంశంలో పవన్ శైలిలో మార్పు వచ్చింది. చంద్రబాబుతో కలిసి వెళ్లటానికి బీజేపీ సిద్దంగా లేదని అర్దమైంది. తాను ప్రధానిని కాదని ముందుకెళ్లేందుకు పవన్ సిద్దంగా లేరు. అదే సమయంలో 2029 లో బీజేపీ - జనసేన కూమటి సీఎం అభ్యర్ధి పవన్ అంటూ కమలం నేదలు ప్రతిపాదన చేసారు. కానీ, 2024లో సత్తా చాటటం పవన్ కు రాజకీయంగా కీలకం. దీంతో, కొత్త వ్యూహం తెర మీదకు తెచ్చారు.

"మీరు కోరుకుంటే నేను సీఎం అవుతా" - అక్కడే మెలిక

పవన్ కల్యాణ్ తాజా వ్యూహంం పైన స్పష్టత వస్తోంది. కాపుల ఓట్లు పవన్ హోల్ సేల్ గా చంద్రబాబుకు అమ్మేస్తున్నారని వైసీపీ ఆరోపిస్తోంది. దీనికి పవన్ కౌంటర్ ఇచ్చారు. తాను ఏ పార్టీకి కొమ్ము కాయనని తేల్చి చెప్పారు. అటు బీజేపీ..ఇటు టీడీపీ పవన్ మైత్రి కోరుకుంటున్నాయి. బీజేపీ కంటే చంద్రబాబుకు 2024 ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం. పవన్ కంటే ఒక విధంగా చంద్రబాబుకు రానున్న ఎన్నికలు కీలకం. చంద్రబాబు లక్ష్యం వైసీపీని ఓడించటం. ఇందుకోసం పవన్ సహకరించేందుకు సిద్దంగా ఉన్నారు. ఇదే సమయంల బీజేపీ నుంచి వస్తున్న ప్రతిపాదనలను పక్కన పెట్టలేదు. "మీరు కోరుకుంటే నేను సీఎం అవుతా" అని పవన్ చెప్పింది పార్టీ శ్రేణులకు కాదు. టీడీపీ అధినేతకు. సీఎంగా తనకు అవకాశం ఇస్తే..వైసీపీ తన పైన చేసే ఆరోపణలకు విలువ ఉండదు. బీజేపీ తనకు అడ్డు చెప్పే ఛాన్స్ లేదు. బీజేపీ 2029 ఎన్నికల్లో బీజేపీ ఇస్తున్న ఆఫర్.. చంద్రబాబు అంగీకరిస్తే 2024లోనే సాధ్యం అవుతుంది. దీంతో, పవన్ ను సీఎంగా చంద్రబాబు అంగీకరిస్తే..పొత్తుతో ముందుకు వచ్చేందుకు సిద్దమని పవన్ ఓపెన్ గానే సంకేతాలు ఇచ్చినట్లు విశ్లేషణలు మొదలయ్యాయి.

చంద్రబాబు అంగీకరిస్తారా - జగన్ ను ఓడించాలంటే

చంద్రబాబు అంగీకరిస్తారా - జగన్ ను ఓడించాలంటే

పవన్ కల్యాణ్ వ్యహం పైన టీడీపీ అధినేత చంద్రబాబు స్పందన కీలకం కానుంది. వైసీపీని ఓడించాలంటే పొత్తు కావాల్సిందే. పవన్ ను సీఎం చేస్తానంటే టీడీపీ శ్రేణులు మద్దతిస్తాయా. పవన్ ను సీఎం చేసేందుకు సహకారం అందిస్తానంటూ చంద్రబాబు ముందుకొచ్చే పరిస్థితి ఉంటుందా అనేది ఇప్పుడు చర్చ. చంద్రబాబు అందుకు అంగీకరించకుంటే పవన్ లక్ష్యం నెరవేరే అవకాశం లేదు. రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తే జగన్ కు అనుకూలంగా మారుతుంది. మరి ఏం చేస్తారు. చెరి రెండున్నారేళ్ల ప్రతిపాదన తెస్తారా. ఆ ఒప్పందం వైసీపీ అనుకూలంగా మలచుకోదా. చంద్రబాబు ఆ ప్రతిపాదనకు అంగీకరించే అవకాశాలు లేవనేది బీజేపీ - వైసీపీ నేతల అంచనా. అది జరిగినా..తమకు అనుకూలమేనని వైసీపీ చెబుతోంది. వ్యూహం తనకు వదిలేయని చెబుతున్న పవన్.. వైసీపీని ఓడించే బాధ్యత నాది అంటూ పరోక్షంగా చంద్రబాబుకు హామీ ఇస్తున్నారు. చంద్రబాబుకు తక్షణం కావాల్సింది అదే. ఇదే పవన్ పవన్ తనకు అవకాశంగా మలచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ఇప్పుడు నిర్ణయం చంద్రబాబు చేతిలో ఉంది. దీంతో.. ఇప్పుడు పవన్ చెబుతున్న వ్యూహాన్ని.. చంద్రబాబు తనకు అనుకూలంగా ఎలా మలచుకుంటార.. పొత్తు పైన ఏ నిర్ణయాలు ఉంటాయనేది ఆసక్తిని పెంచుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+